మూఢ విశ్వాసంతో సజీవంగా సమాధిలోకి.. మరి ఏం జరిగింది..?

జాంబియాన్ పట్టణంలోని జియోన్ చర్చిలో పాస్టర్ గా పనిచేస్తున్న 22 ఏళ్ల జేమ్స్ సకారా మూఢ విశ్వాసంతో తనని తాను దైవం పంపిన దూతగా భావించేవాడు. జీసస్ తర్వాత తానే అన్నట్లుగా వ్యవహరించేవాడు. అయితే ప్రజల్లో నమ్మకం కలగడం లేదనే కారణంతో సజీవ సమాధిలోకి వెళ్లాలని ప్లాన్ చేశాడట. తన అనుచరులు వద్దని వారిస్తున్నా అతడు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నాడట. మూడు రోజులు సమాధిలో ఉండి వచ్చేస్తానని చెప్పాడు. ( ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి )

అదే మూఢ విశ్వాసంతో వున్న అతను , దేవుడి బిడ్డలాగా నేను కూడా మూడు రోజుల తర్వాత ప్రాణాలతో బయటకు వచ్చేస్తాను.. మీరు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపాడు. అయితే ఈ విషయాన్ని ప్రజలకు చెప్పలేదు. ముగ్గురు చర్చి సిబ్బందితో కలిసి ఈ ప్లాన్ చేశాడు. సుమారు నాలుగు అడుగుల గొయ్యి తవ్వారు. ఆ తర్వాత జేమ్స్ చేతులను వెనక్కి కట్టి బ్రతికి ఉండగానే అతని పూడ్చి పెట్టారు. మూడు రోజుల తర్వాత ఈ విషయాన్ని ప్రజలు చెప్పారు. పాస్టర్ జేమ్స్ సమాధి నుంచి బయటకు రానున్నారని చెప్పారు. దీంతో అక్కడి జనం అంతా గుమిగూడారు. చర్చి సిబ్బంది సమాధి తవ్వారు. జేమ్స్ బతికే ఉంటాడని భావించారు కానీ, అప్పటికే జేమ్స్ ప్రాణాలు కోల్పోయారు.

విశ్వాసం ఉండొచ్చు కానీ మూఢ విశ్వాసం చాలా ప్రమాదం

అయితే అతడు గాఢనిద్రలో ఉన్నాడని.. తప్పకుండా బ్రతుకుతాడు అంటూ అతని అనుచరులు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. కానీ జేమ్స్ బతకలేదు. అతన్ని సమాధిలో పడుకోబెట్టిన ముగ్గురు సిబ్బందిలో ఒకరు పోలీసులకు లొంగిపోయాడు. మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు. అయితే ఇలాంటి ఘటనలు ఆఫ్రికాలో సర్వసాధారణమే. అక్కడి ప్రజలను నమ్మించేందుకు కొంతమంది ఇలాంటి పనులు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటూ ఉంటారు. విశ్వాసం ఉండొచ్చు కానీ మూఢ విశ్వాసం ఉండకూడదు అనేది ఇప్పుడు పలువురు చెబుతున్న మాట. అయితే ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడం విశేషం. ( డిజిటల్ బిజినెస్ హబ్ గా టాటా )

మన దేశంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలను చూస్తూ ఉంటాం. చిన్న పిల్లలను సైతం బాలి ఇచ్చే భయానక ఘటనలు ఎన్నో చూసాము. సూపర్ పవర్స్ వస్తాయని ఒకరు.. పరలోకం పిలుస్తోందని మరొకరు.. అల్లా కోసం ఇంకొకరు.. ఇలా ఎన్నో దారుణాలు. కొందరు పాస్టర్లు, బాబాలు, దర్గాలు నడిపే కొందరు తమ వ్యాపారాల కోసం చేసే గారడీల వలన కొందరు అమాయకులు ఇలాంటి కోమాలోకి వెళ్ళి పోతూ ఉంటారు అనేది కొందరి వాదన. ఏది ఏమైనా మూఢనమ్మకాలకు, నమ్మకాలకు మధ్య ఉన్న ఆ సున్నితమైన తేడాను గ్రహిస్తే ఇటువంటి ఘటనలు జరగవనేవి నిజం.

More Latest telugu news todayOnline telugu news todayPolitical newsonline news today

2 thoughts on “మూఢ విశ్వాసంతో సజీవంగా సమాధిలోకి.. మరి ఏం జరిగింది..?”

Leave a Comment