ఎవ్వరు వచ్చినా జరిగేది అదే..

ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు ఇంకో పార్టీలో చేరి మంత్రి పదవులు అనుభవించడం టిడిపి హయాంలో జోరుగా సాగింది. వలసలు ప్రోత్సహించడం అందరూ చేసే పనే. అయితే ఆ వలస వచ్చిన నాయకులను నెత్తిమీద పెట్టుకుని పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టేయడం చంద్రబాబుకు తెలిసినట్టుగా వేరే వారికి తెలియదనే చెప్పాలి.

ఇలాంటి నిర్ణయాల వల్లే చంద్రబాబు గత ఎన్నికల్లో దారుణాతి దారుణంగా ఓడిపోయారు. వైసీపీ నుంచి టిడిపిలోకి వెళ్లి మంత్రి పదవులు వెలగబెట్టిన ఏ ఒక్కరు రెండోసారి గెలవలేదంటే వారిని జనం ఎంతలా చీదరించారో అర్థమవుతుంది.

అలాంటిది ఇప్పుడు వైసిపి హయాంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది అంటూ టిడిపి దుష్ప్రచారానికి తెర తీస్తోంది. విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడి వైసీపీలోకి వస్తున్నారని.. అలా వచ్చిన వెంటనే ఆయనకు జగన్ మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అంటూ టిడిపికి చెందిన కొన్ని సోషల్ మీడియా పేజీలు ప్రచారం చేస్తున్నాయి.

ఆ మంత్రి పదవి కూడా అవంతి శ్రీనివాస్ నుంచి వెనక్కి తీసుకుని మరీ ఇస్తారని చెబుతున్నాయి. ఇంతకంటే దారుణమైన ప్రచారం ఇంకొకటి ఉంటుందా. టిడిపి ఎమ్మెల్యే కోసం జగన్ తన మంత్రిని బలిచేస్తారంటూ పచ్చ సోషల్ మీడియా ప్రచారానికి తెర తీసింది. దీంతో సహజంగానే విశాఖలో కలకలం రేగింది.

గంట ఇవ్వాళ కాకపోతే రేపైనా వైసీపీలో చేరుతారనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. గంటా వచ్చినా.. ఇంకెవరైనా వస్తానన్న కూడా జగన్ రాజీనామా అడుగుతున్నాడు. అందుకే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ కు జై కొట్టినా తాము మాత్రం నేరుగా వైసీపీ కండువా కప్పుకోలేదు. తమ కొడుకులను,అనుచరులను వైసీపీలోకి చేర్చి వారు ఇంకా టిడిపి ఎమ్మెల్యేలు గానే కొనసాగుతున్నారు.

ఒకవేళ గంటా వైసీపీ లోకి వస్తానన్నా ఈ తరహా మార్గాన్ని కొనసాగిస్తారు తప్ప ఆయనకు పిలిచి మరీ కిరీటం పెట్టే పరిస్థితి కనపడటం లేదు. విశాఖ నాలుగు దిక్కులు తమవే అంటూ విర్రవీగుతున్న టిడిపి.. ఇటీవలే ఓ దిక్కుని కోల్పోయింది. వాసుపల్లి గణేష్ ఇటీవలే వైసిపి గూటికి చేశారు. ఇప్పుడు గంటా కూడా చేజారబోతున్నారు అన్న బాధలో టిడిపికి చెందిన కొన్ని సోషల్ మీడియా పేజీలు కొన్నికట్టు కధలు అల్లుతున్నాయి.

వైసీపీలో వైషమ్యాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. గంట నేరుగా వచ్చినా.. రాజీనామా చేసి వచ్చినా.. తను రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వచ్చినా కూడా మంత్రి పదవి ఇవ్వడం కుదిరే పని కాదు. తనను నమ్ముకున్న వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారిని అందలం ఎక్కించడం జగన్ కు చేతకాని పని. గతంలో చంద్రబాబు చేసిన తప్పును జగన్ ఎన్నటికీ చెయ్యరని ఆ పార్టీ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు.

Leave a Comment