2019 లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రిగా తన మొదటి ఢిల్లీ పర్యటనలో అప్పుడు రెండోసారి ప్రధానిగా ఎన్నిక అయినటువంటి నరేంద్ర మోడీ గారిని కలిసి బయటకొచ్చి ఒక మాట అన్నారు. “మన కర్మ.. వాళ్లకు సంపూర్ణ మెజారిటీ వచ్చింది.. ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన హక్కులను ప్రతిసారి అడిగి చేయించుకోవాల్సిందే.. ఇక ఆ ప్రయత్నమే చేస్తాము” అని అప్పటి పర్యటనలో స్పష్టంగా చెప్పారు.
చెప్పిన విధంగానే ఈ రెండు సంవత్సరాల వరకూ జగన్ మోహన్ రెడ్డి గారు అదే పని చేస్తూ ఉన్నారు. కేంద్రంతో సన్నిహితంగానే ఉంటూ వస్తున్నారు. ప్రతి విషయంలో కూడా కేంద్రానికి మద్దతిస్తూ వస్తూనే ఉన్నారు. అది కూడా ఎందుకోసం అంటే రాష్ట్రం, కేంద్రంతో గనుక సన్నిహితంగా ఉంటే.. రాష్ట్ర హక్కులను నెరవేర్చుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా తన మొదటి ఢిల్లీ పర్యటనలో భాగంగా తాను చెప్పిన మాట. అందుకని ఈ రెండు సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఒక మిత్రపక్షంగా ఉన్నట్టు వ్యవహరిస్తూ వచ్చారు.
వైఎస్ జగన్ మద్దతిచ్చినా ఫలితం శూన్యం
అయితే ఫలితం ఏంటి అంటే.. తాను ఏ రాష్ట్ర ప్రయోజనం కోసం అయితే సన్నిహితంగా ఉండటం వల్ల జరుగుతుందని ఆశించారో అది వేరవేరడం లేదు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం తీసుకున్నా.. విశాఖ రైల్వే జోన్ తీసుకున్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకున్నా.. పోలవరం నిధులు తీసుకున్నా.. జాతీయ రహదారులు, జాతీయ సంస్థలకు నిధుల గురించి అయినా.. ఏ ఒక్క విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్దతుగా నిలవలేదు. అయినా కూడా జగన్ మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ అటు పార్లమెంట్ లోక్సభలోనూ, , ఇటు రాజ్యసభలోనూ వాళ్లకు మద్దతిస్తూ వస్తూనే ఉంది.
- దేశం మొత్తానికి గంజాయి సరఫరా చేసిన క్రెడిట్ మాదే.. గంటా శ్రీనివాస్
- బోండా ఉమాపై అందుకే కేసు నమోదు చేయలేదేమో.. !
- సిఐ నాయక్ పై దాడి.. నారా లోకేష్ పై హత్యాయత్నం కేసు
- జనసేన పార్టీ అధ్యక్షుడిని వెంటాడుతున్న నవతరం పార్టీ
మళ్లీ ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ చేసే అప్పుల మీద పరిమితులు విధిస్తూ అక్కడ కూడా ఇబ్బందులు పెడుతూ వస్తున్నారు. వీటన్నిటికీ మించి తనను,తన పార్టీని, తన ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలతో కలిసి అప్రతిష్ట పాలు చేయడానికి తన పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సిద్ధపడితే.. ఆ ఎంపీకి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు లోక్ సభ స్పీకర్ కు సమర్పించినా కూడా, అతనిమీద అనర్హత వేయకుండా మీనవేషాలు వేయడం. ఇవన్నీ చుసిన జగన్ మోహన్ రెడ్డి కి ఒకింత సహనం కోల్పోవడానికి కారణమనే చెప్పాలి.
ఎంపీ రఘురామకి ప్రత్యేకంగా
ఆయన పై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. హోం మినిష్టర్ అమిత్ షా సైతం తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం, మరి కొంతమంది మంత్రులను కలవడం కూడా జగన్ కు చిర్రెత్తుకొచ్చేలా చేశాయి. రఘురామ పై వున్న ఫిర్యాదులపై సిబిఐ కొంచెం కూడా ముందుకు కదలడం లేదు. దీనిపై ఏకంగా ఈరోజు రాష్ట్రపతికి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు కూడా చేశారు. ఇన్నిరోజులు కేంద్రంతో సఖ్యతతో ఉన్నాకూడా, ఎటువంటి రాష్ట్ర ప్రయోజనాలు కలుగక పోగా , రాష్ట్రం లోని ప్రజల నుండి ఒత్తిడి పెరిగే అవకాశం వున్న నేపథ్యంలో ఒకింత తిరుగుబాటు మొదలెట్టారనే అర్ధమవుతోంది.
- మా బాబుగారు సింహంలా ఢిల్లీ వస్తే ఎవరూ పట్టించుకోరే.. !
- పాకిస్తాన్ లో తాలిబన్ జెండాలు.. ఉలిక్కిపడ్డ ఇమ్రాన్ ఖాన్
- పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ రాజీనామా..!
- చైనా గుప్పెట్లోకి శ్రీలంక దీవులు..భారత్ కు ముప్పు పొంచిఉందా ..?
అందుకే పార్లమెంట్ సాక్షిగా లోక్ సభలోనూ , రాజ్యసభలోనూ వైసీపీ ఎంపీలు రాష్ట్రాకిని అన్నాయం చేస్తున్నారని.. పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని.. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మేం ఎప్పుడూ చూడలేదంటూ కేంద్రం పై ఒత్తిడి పెంచుతూ నోటీసులు కూడా ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి ఉండగానే ఏమాత్రం వెనుకాడకుండా వెల్ లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.
రాజ్యసభలో వైసీపీ ఎంపీల అవసరం
ఒకరకంగా వీరి ప్రయత్నాల వల్ల కేంద్రానికి ఒకింత ఇబ్బందికర పరిస్థితే ఏర్పడింది. కారణమేంటి అంటే వైసీపీ పార్టీ లోక్ సభలో నాల్గవ అతిపెద్ద పార్టీ. రాజ్యసభలో 6వ అతిపెద్ద పార్టీ. లోక్ సభలో కేంద్రానికి మెజారిటీ ఉన్నాకూడా .. రాజ్యసభలో వీరి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికిప్పుడు వారిని దూరం చేసే ప్రయత్నం అయితే బీజేపీ చేయలేదు. ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డికి ఢిల్లీ నుండి పిలుపు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెలాఖరు వరకు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉండొచ్చు.
అదేగనుక జరిగితే మరోసారి డైరెక్ట్ గా ఢిల్లీ పెద్దలతో తమ రాష్ట్రానికి రావాల్సిన వాటిపై నిలదీస్తే కొంతైనా ఫలితం దక్కుతుంది. ఇప్పటివరకు మద్దతు ఇచ్చినందుకు ఏమీ సహకరించని కేంద్రం .. వ్యతిరేకించినంత మాత్రాన వేరే ఇబ్బందులకు గురిచేసే అవకాశం కూడా లేదు. కేంద్రానికి జగన్ పార్టీ ఎంపీల అవసరం ఎంతైనా వుంది. ఎందుకంటే ఇప్పటికే రాజ్యసభలో NDA నుంచి వారి మిత్రపక్షాలు వైదొలిగాయి కూడా. అందువల్ల జగన్ కేంద్రంతో రాష్ట్ర హక్కుల కోసం పోరాటం కొనసాగించినా కూడా ఒక బలమైన పార్టీగా ఉన్న వైసీపీని కేంద్రం దూరం చేసుకోలేదు అన్నది నిజం.
1 thought on “రంగంలోకి దిగిన వైఎస్ జగన్ .. స్పీడ్ పెంచిన వైసీపీ ఎంపీలు”