నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు

ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం పాటు చాలా సమస్యలు కూడా రెండు రాష్ట్రాల మధ్య పేరుకుపోయి ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏవీ ఇక్కడి సమస్యల మీద పెద్దగా దృష్టి కేంద్రీకరించలేదు. ఆ తర్వాత 2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు దశాబ్దాలుగా పేరుకుపోయిన ఈ సమస్యను పరిష్కరించే దిశగా కొన్ని కీలకమైన ముందడుగులు వేశారు. ( కొటియా గ్రామాలపై జగన్ మోహన్ రెడ్డి దూకుడు.. రంగంలోకి కేంద్రమంత్రి )

అందులో భాగంగానే ఈరోజు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ముఖ్యమంత్రి వైస్ జగన్ గారు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలకు ఒక పరిష్కారం కనుగొనాలి అన్న ఉద్దేశంతో ఒడిశా పర్యటనకు వెళ్తున్నారు. పోలవరం నిర్మాణానికి సంబంధించిన ఒడిషా అభ్యంతరాల పైన.. నేరేడు బ్యారేజీపైనా.. మరీ ముఖ్యంగా జంజావతి డ్యామ్.. ఇటువంటి సమస్యలు చాలా కాలం నుంచీ రెండు రాష్ట్రాల మధ్య నలుగుతూనే ఉన్నాయి.

దీనికి తోడు ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లో మావోయిస్టుల ప్రభావం.. ఈ మధ్య కొత్తగా మళ్లీ గంజాయి సాగు, గంజాయి రవాణా వంటి వాటిపై జరుగుతున్నా రచ్చ కూడా చర్చనీయాంశమవుతోంది. అలాగే దశాబ్ద కాలంగా ఉన్న మరో సమస్య కోటియా గ్రామాల సమస్య. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఈ సమస్యపై చూసి చూడనట్టు వున్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ గ్రామాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని అక్కడికి ప్రభుత్వ పథకాలు పంపించారు. అక్కడ ఎన్నికలు కూడా జరిపించారు.

ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ లోనే కలిసి ఉంటాము అని చెప్పి వాళ్ళు ఆందోళన చేసే పరిస్థితికి తీసుకువచ్చారు. ఆ గ్రామాల ప్రజలు మేము ఆంధ్రప్రదేశ్ లోనే కలుస్తాము అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. దీంతో తేరుకున్న అక్కడి ఒడిశా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి.. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, నాయకులకు అక్కడికి పోనీయకుండా అడ్డుకున్నారు. ( జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోసం చంద్రబాబు ఆరాటం.. అది సాధ్యమవుతుందా.. ? )

మధ్యలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పలుమార్లు లేఖలు రాశారు. సమస్య-పరిష్కారం అయ్యేంతవరకు దూకుడుగా వెళ్లొద్దంటూ జగన్ గారికి సూచించారు. ఒడిషా ముఖ్యమంత్రి గారితో కలిసి చర్చించండి.. సమస్యలకు పరిష్కారం కనుక్కోండి అని చెప్పి ఆయన కూడా ముఖ్యమంత్రి గారికి సూచించారు. మొత్తానికి ఇలాంటి ప్రధానంగా ఈ ఐదారు ఎజెండాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒడిశా ముఖ్యమంత్రిని కలవబోతున్నారు.

ఈరోజు ఉదయం 11 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి గారు మధ్యలో శ్రీకాకుళం చేరుకొని అక్కడ ఎమ్మెల్యే రెడ్డి శాంతి వాళ్ళ కుమార్తె వివాహ రిసెప్షన్ లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం శ్రీకాకుళం పర్యటన ముగించుకొని 3 గం. 30 నిమిషాలకు విశాఖ ఎయిర్ పోర్ట్ వచ్చి.. 5 గంటలకు ఒడిషా ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో 7 గంటల వరకు చర్చలు జరిపి తిరిగి 7 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 9:00 గం.లకు జగన్ మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ పర్యటన విజయవంతం అవ్వాలని అక్కడి సరిహద్దు ప్రాంత ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Leave a Comment