2014లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం రాష్ట్ర విభజన. నిర్ఘాంతపోయిన రాష్ట్రానికి చంద్రబాబు తన అనుభవంతో ఒక దారి చూపుతారు అని ప్రజలు భావించారు. గాయాన్ని అతిత్వరగా మర్చిపోయేలా చేసే పరిపాలనా వైద్యుడిగా ఆయనను ప్రజలు ఊహించుకున్నారు. కానీ చంద్రబాబు అందుకు పూర్తి భిన్నంగా అనుసరించి ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు.
రాజ్యం సమస్యల్లో చిక్కుకున్నప్పుడు.. ప్రజలు బాధలో ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి ఆ బాధ నుంచి వీలైనంత త్వరగా తేరుకునేలా చేయడం ఉత్తముడైన పాలకుడి లక్షణం. చంద్రబాబు మాత్రం విభజన గాయాన్ని మరిచిపోయేలా చేయడం అటుంచితే, ఆ గాయాన్ని పదేపదే గిల్లుతూ ప్రజల్లో భావోద్వేగాలను సజీవంగా ఉంచేందుకు ప్రయత్నించారు.
విభజన గాయం ప్రజలకు గుర్తున్నంత కాలం తన పాలన పై ఒత్తిడి గాని, అంచనాలు గానీ పెద్దగా ఉండవు అన్నది చంద్రబాబు ఆలోచన. చరిత్రలో సాక్షాలు ఉన్నా ఏపీకి అవతరణ దినోత్సవం నిర్వహించకుండా ప్రతి ఏటా జూన్ 2న విభజన గాయాన్ని ప్రజలకు గుర్తు చేసే దినంగా చంద్రబాబు మలిచారు.
పేరుకే గాని ఆయన నిర్వహించిన కార్యక్రమంలో నవ నిర్మాణానికి దీక్షపూని ఛాయలు కనిపించేది కాదు. గాయాన్ని గిల్లి మరోసారి శోకించే దినంగా నవనిర్మాణ దీక్షలను చంద్రబాబు మార్చేశారు. చంద్రబాబు ఆలోచన దారి తప్పిందని రెండో ఏడాదికే ప్రజలకు అర్థమైపోయింది కాబట్టే బెంజ్ సర్కిల్ లో ఖాళీ కుర్చీలు మాత్రమే ఆయన నిర్వహించే నవనిర్మాణ దీక్షకు తెల్లబోయి కనిపించాయి.
విభజన జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్ సాధించిన బ్రాండ్ ఇమేజ్ కోల్పోకుండా ఉండాలంటే నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహించుకోవాలని నాడే కేంద్ర హోంశాఖ సూచించినా చంద్రబాబు పట్టించుకోలేదు. గాయపడ్డ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయకత్వంలో ధీరగాధను లిఖిస్తుందని ప్రజలు ఆశిస్తే చంద్రబాబు మాత్రం ఐదేళ్లు దీనగాథను స్మరించుకుంటూ సరిపెట్టారు.
చంద్రబాబు నాయకత్వం ఆంధ్రప్రదేశ్ కు కనీస స్థాయిలో దిశానిర్దేశం చేయలేకపోయింది అన్నదానికి అయిదేళ్లలో అవతరణ దినోత్సవానికి అనువైన రోజులు కూడా గుర్తించకపోవడమే చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మన పుట్టిన రోజు ఎప్పుడు జరుపుకోవాలి అన్న దానికంటే సోదరుడు పుట్టాడే అంటూ సోదరుడి పుట్టినరోజునాడు బాధ పడేందుకే చంద్రబాబు సర్కారు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.
ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎట్టకేలకు నవంబర్ 1ని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా నిర్వహించింది. తమ రాష్ట్రానికి ఒక దినోత్సవం ఉంది అని ప్రజలు స్వాంతన పొందే అవకాశం ఇచ్చింది. తాను చేయని పని జగన్ చేశారన్న బాధతో ఏమోగానీ ప్రధాని మోడీ నుంచి ఉప రాష్ట్రపతి వరకూ అందరూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపితే, టిడిపికి మాత్రం మనసు రాలేదు.
పైగా మద్రాసు నుంచి ఏర్పడిన ఆంధ్రప్రదేశే ఇప్పుడు ఉంది కాబట్టి అక్టోబర్ 1నే రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహించుకోవాలి అంటూ కొత్త పంచాయతీనీ లేవనెత్తే ప్రయత్నం చేశారు. బ్రాండ్ ఇమేజ్ కోల్పోకుండా ఉండేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబర్ 1 నే అవతరణ దినోత్సవంగా నిర్వహించు కోవాల్సిందిగా కేంద్ర హోంశాఖ చంద్రబాబు హయాంలోనే స్పష్టత ఇచ్చింది.
ఏదిఏమైనా 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు తగిలింది పెద్ద గాయమే అయినా, అవి చూసుకుంటూ దిగులు పడే అవకాశం లేదు. కష్టమో నష్టమో కేంద్రం సహకరిస్తుందో, చేయిస్తుందో. ఏది జరిగినా ఆగడానికి లేదు. ముందుకు కదలాల్సిందే. రాజకీయ, అసూయ ద్వేషాలను పక్కనపెట్టి వ్యవస్థలు కూడా వ్యక్తుల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఎదగడం అంత కష్టమైన పనేం కాదు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …