భూమా నాగిరెడ్డి దంపతులు మరణంతోనే కర్నూలు జిల్లాలో భూమా కుటుంబ రాజకీయాలకు తెరపడింది అని అనుకున్నారంతా. కానీ అఖిల ప్రియను మంత్రిని చేసి గత టీడీపీ ప్రభుత్వం కాస్తోకూస్తో ఊపిరి పోసింది. ఇప్పుడు బోయిన్పల్లి కిడ్నాప్ కేస్తో కర్నూలు జిల్లాలో భూమా కుటుంబం పరువు పూర్తిగా మంటగలిసింది.
గతంలో అఖిల భర్త భార్గవ్ రామ్ వ్యవహారాలను స్థానికులు చీదరించుకున్నా.. ఇప్పుడు చీటింగ్ స్టోరీతో ఆ ఫ్యామిలీ పరిస్థితి పూర్తిగా దిగజారింది. మరో వైపు రాజకీయంగా కూడా భూమా కుటుంబానికి గడ్డుకాలం ఎదురవుతుంది.
ఓ వైపు అఖిలప్రియ జైల్లో ఉండటం, మరో వైపు ఆమె భర్త, తమ్ముడు పరారీలో ఉండడం, ఆమె చెల్లెలు సింపతి కోసం డ్రామాలాడటం.. ఇలా చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు తయారయింది ఆ కుటుంబం పరిస్థితి. ఇదే సమయంలో కర్నూల్లో పాతికేళ్లుగా భూమా కుటుంబానికి అండగా వున్న విజయ డైరీ చైర్మన్ పదవి ఇప్పడు ప్రత్యర్థులకు వెళ్లడం మరో షాకింగ్ న్యూస్..
పాతికేళ్లుగా భూమా నాగిరెడ్డి చిన్నాన్న భూమా నారాయణ రెడ్డి ఏకగ్రీవంగా గెలుస్తూ వస్తున్న విజయ డైరీ చైర్మన్ పదవి ఈసారి వైసీపీ కి చెందిన ఎస్వీ జగన్మోహన్ రెడ్డికి చెందుతుందని సమాచారం. ఎస్వీ మోహన్ రెడ్డి ఎవరో కాదు.. అఖిలప్రియకు మేనమామ. శోభా నాగిరెడ్డికి స్వయానా తమ్ముడు. నాగిరెడ్డి దంపతుల మరణంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు బాగా మొదలయ్యాయి.
ఎస్వీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబానికి నమ్మకస్తుడిగా కొనసాగుతూ వస్తున్నారు. టీడీపీ ప్రలోభాలకు ఆయన ఏనాడూ లొంగలేదు. ఆ నమ్మకంతోనే ఆయనకు విజయ డైరీ చైర్మన్ పదవి కట్టబెట్టాలని.. భూమా కుటుంబానికి చెక్ పెట్టాలని ఆలోచిస్తున్నారు సీఎం జగన్. ఇటీవల కర్నూలు జిల్లా పర్యటనలో కూడా ఇదే విషయాన్ని ఎమ్మెల్యేల వద్ద స్పష్టం చేశారట.
విజయ డైరీ టర్నోవర్ ఏడాదికి 140 కోట్ల రూపాయలు. పాతికేళ్లలో ఛైర్మన్ పదవిని అడ్డుపెట్టుకొని భూమా నారాయణరెడ్డి భాగానే వెనకేసుకున్నారని, రైతులు, ఉద్యోగులకు రావాల్సిన సొమ్మంతా దిగమింగారని విమర్శలు ఉన్నాయి. తన కుటుంబానికి చెందిన జగత్ డైరీతో కుమ్మక్కై అక్రమాలు కొనసాగిస్తున్నారు.
అడ్వాన్స్ ల రూపంలో జగత్ డైరీ కి నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఇచ్చారని ఆరోపణ కూడా ఉంది. కేవలం ఒక జగత్ డైరీయే విజయ డైరీకి 50 లక్షలు బకాయిలు ఉండటం విశేషం. ఇక భార్య పేరుతో వున్న కార్ ను కంపెనీ కోసం వాడుకుంటూ బిల్లులు పెట్టుకున్నాడట నారాయణరెడ్డి.
గతంలో రోజుకు ఒక లక్షా 30వేల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించే విజయ డైరీ ఇప్పుడు కేవలం 30 వేల లీటర్లు మాత్రమే కొనుగోలు చేసే స్థితికి దిగజారడం కూడా ఆయన ఘనతే అంటున్నారు. మొత్తంమీద భూమా అక్రమాలన్నిటికీ ఇప్పుడు చెక్ పడబోతుందన్నమాట.
140 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న విజయ డైరీ ఛైర్మన్ పదవిని మరోసారి నిలబెట్టుకునేందుకు భూమా నారాయణ రెడ్డి కూడా విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు ఎస్వీ కుటుంబం కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది.
ఇప్పటికే మూడు డైరెక్టర్ల పోస్టులకు, చైర్మన్ పదవికి నామినేషన్లను సవీకరించారు. ఈ నేపథ్యంలో విజయ డైరీ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ పోస్ట్ కూడా భూమా కుటుంబం నుంచి వెళ్లి పోతే ఇక కర్నూల్ లో ఆ కుటుంబం రాజకీయ ప్రయాణం భూస్థాపితం అయినట్లే అని అంటున్నారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …