విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో 100% పెట్టుబడులను ఉపసంహరించడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం.. సాధారణ బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆ అంశాన్ని చేర్చడం వంటి కీలక చర్యల అనంతరం రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.
అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు దీన్ని అస్త్రంగా మార్చుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా కూడా చేశారు.
ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు కర్మాగారం పై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలు, వ్యతిరేకతలను పట్టించుకోకుండా మోడీ సర్కారు ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపితే విశాఖ స్టీల్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవటానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై జగన్ సర్కార్ అధ్యయనం కూడా మొదలు పెట్టేసింది. విశాఖ ఉక్కును రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని రావటానికి రాజకీయ పరమైన ఒత్తిడి కూడా మోడీ సర్కార్ పై తీసుకురావాలని, దానికి సంబంధించిన చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రూపొందించిన పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక స్టీల్ ఫ్యాక్టరీని కేటాయించాల్సి ఉంది. ఏడేళ్ల తర్వాత కూడా దాని ఊసు ఎత్తట్లేదు మోడీ సర్కారు. తాజాగా ఇప్పటికే ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించడానికి సన్నాహాలు చేపట్టింది.
పునర్విభజన చట్టం ప్రకారం ఇస్తామని హామీ ఇచ్చిన స్టీల్ ప్లాంట్ కేటాయించే పరిస్థితిలో మోడీ సర్కార్ లేదన్నది స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విక్రయించడం కంటే దాన్నే రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించేలా మరో వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో ఈ రెండు అంశాల ద్వారా మోడీ సర్కార్ పై అన్ని రకాల ఒత్తిడి తీసుకురావాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే వైయస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు.
విశాఖ ఉక్కు ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, ఉద్యమాల గురించి ప్రస్తావించారు. ఆ ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకురావటానికి అవసరమైన కొన్ని సూచనలు కూడా చేశారు. దానిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …