ఏపీ విద్యా విధానంలో కొత్త ఒరవడి..

ఉన్నత విద్యా రంగంలో నూతన విద్యా విధానం అన్న అంశంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సతీష్ చంద్ర, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యూలేటరీ అండ్ మోనిటరింగ్ కమీషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

జాతీయ విద్యా విధానం 2020 లో ఏం ప్రస్తావించారు, రాష్ట్రంలో ప్రస్తుత విద్యా విధానం ఎలా ఉంది వంటి అన్ని అంశాలపై సమావేశంలో అధికారులు వివరించారు. స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్ ఓరియంటేషన్ ప్రధాన లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల హానర్స్ డిగ్రీ కోర్సు ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Education meeting

సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్ జగన్ (ys jagan) మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కాలేజీలు వచ్చే మూడేళ్లలో నేషనల్ బోర్డ్ అక్రిడిటేషన్ (NBA), నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAC) సిర్టిఫికెట్ సాధించాలన్నారు. అన్ని ప్రభుత్వ కాలేజీలు కూడా తప్పనిసరిగా గుర్తింపు పొందాలని పేర్కొన్నారు. ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ తో సహా అన్ని కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని సీఎం ఆదేశించారు.

మూడేళ్లలో కాలేజీలో మార్పు రాకపోతే చర్యలు తప్పవని చెప్పాలన్నారు. ప్రమాణాలు పాటించని ఇంటర్మీడియట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బీఈడీ కాలేజీలు కచ్చితంగా ప్రమాణాలు పాటించి తీరాలి.

టీచర్ ట్రైనింగ్ సంస్థలలో క్వాలిటీ లేకపోతే నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించాలని, టీచర్ల శిక్షణ లోననే నాణ్యత లేకపోతే వారి పిల్లలకు పాఠాలు ఎలా చెప్తాం. కాలేజీల్లో ప్రమాణాలు నాణ్యతతో కూడిన బోధనకు సంబంధించి ఒక SOP ఖరారు చేసుకోండి. దానికి ముగ్గురు చొప్పున పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి.

వారు అన్ని కాలేజీలలో తనిఖీలు నిర్వహించాలి. మరియు శాశ్వత స్క్వాడ్ మాదిరిగా ఉండాలి, వారి పని తీరులో పారదర్శకత కోసం వారిని రొటేట్ చేస్తూ ఉండాలి. ప్రమాణాలు నాణ్యతలేని కాలేజీలకు కొంత సమయం ఇచ్చి వాటిని మార్చుకోమని చెప్పండి. ఈ తనిఖీ ప్రక్రియ నిరంతరం కొనసాగాలని సీఎం పేర్కొన్నారు.

కాగా కాలేజీలో ప్రమాణాలపై ఇప్పటికే దృష్టి పెట్టామని చెప్పిన అధికారులు, 200కు పైగా కాలేజీలకు నోటీసులు ఇచ్చినట్లు సమావేశంలో తెలిపారు. నిర్ణీత సమయంలోగా వాటిలో మార్పు రాకపోతే తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు.

ఇక మీదట రాష్ట్రంలో ఏడాది లేదా రెండేళ్ళ పేజీ ప్రోగ్రాములు, మూడు లేదా నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రామ్లు ఉంటాయి. ఈ ఏడాది నుంచే అవి ప్రారంభమౌతాయి. నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన వారికి నేరుగా పీహెచ్డీ అడ్మిషన్ ఇస్తారు. వచ్చే ఏడాది నుంచి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రాం ఉంటుంది.

Leave a Comment