ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. 16 భాషల్లో 47 వేలకు పైగా పాటలు పాడిన గాన గంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలని లేఖలో ప్రధానిని జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే బాలసుబ్రమణ్యంకు భారతరత్న ఇవ్వాలని పలువురు ప్రముఖులు కూడా కోరుతున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం కు భారతరత్న ఇవ్వాలని ప్రముఖ నటుడు అర్జున్ కూడా కోరారు. దీనికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీ ప్రభుత్వం తరపున ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాశారు, భారత రత్న ఇవ్వాల్సిందిగా కోరాడు.
మరోవైపు ఆసుపత్రి బిల్లులపై జరుగుతున్న ప్రచారాన్ని బాలు కుమారుడు ఎస్పీ చరణ్ ఖండించారు. వైద్యం అందించిన చెన్నై MGM ఆస్పత్రి బాలు కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టిందని, మూడు కోట్ల రూపాయల బిల్లు వేసిందని, డబ్బు మొత్తం చెల్లించే వరకూ భౌతికకాయాన్ని కూడా అప్పగించ లేదని, చివరకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె ఆసుపత్రి బిల్లులు చెల్లించడంతో సమస్య పరిష్కారమయ్యిందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
వెంకయ్యనాయుడు మీద అభిమానంతో ఈ పుకార్లు సృష్టించారు ఏమో గాని ఈ ప్రచారాన్ని ఎస్పీ చరణ్ ఖండించారు. ఇలాంటి పుకార్లు ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదు అని అన్నారు. ఇలాంటి ప్రచారాన్ని ఖచ్చితంగా బాలు అభిమానులు చేసి ఉండరని ఆయన అభిప్రాయపడ్డారు. (రామ జన్మభూమి అయోధ్యకు 613 కిలోల గంట.)
హాస్పిటల్ సిబ్బంది వైఫల్యం లేనే లేదని ఆయన వివరించారు. బిల్లుల విషయంలో తమను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదని, వారు అన్ని విధాలా సహకరించారని తెలిపారు. త్వరలోనే ఆసుపత్రి బిల్లులను కూడా వెల్లడిస్తామని అప్పుడు అందరికీ ఒక అవగాహన వస్తుందని మీడియా ముఖంగా వెల్లడించారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …