ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన జగన్..

మాటంటే మాటే.. ఒక్కసారి మాటిచ్చాడు అంటే ఇక వెనకడుగు వేస్తే ప్రసక్తే లేదు. ఇదే స్టాటజీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఘన విజయాలను తెచ్చిపెడుతున్నాయా అంటే అవుననక తప్పదు. మాట ఇచ్చారా కచ్చితంగా నెరవేర్చి తీరుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంతకైనా వెళ్తున్నారు.

ఏపీఎస్ఆర్టీసీ కి చెందిన 52 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో చేర్చి మరో గొప్ప ఘనత సాధించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏ సీఎం చేయని విధంగా కొత్త కొత్త ఐడియాలతో అద్భుతమైన పరిపాలన చేస్తూ పక్క రాష్ట్రాలు సైతం ఔరా అనిపించే విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో వైఎస్ జగన్ ఎప్పుడు కూడా ఒకడుగు ముందులోనే ఉంటున్నారు.

అయితే ఆర్టీసీలో 52 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు జాబితాలో చేర్చాలి అంటూ, సమగ్ర నివేదికను సిద్ధం చేయాలి అంటూ ముఖ్యమంత్రి జగన్ అధికారుల్ని ఆదేశించారట. దీంతో ఆర్టీసీ కార్మికులు ఇంక పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నారు అన్నమాట.

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తొలి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పై వైఎస్ జగన్ క్యాబినెట్ తీర్మానం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఆ తర్వాత అసెంబ్లీ లో దానికి ఆమోద ముద్ర కూడా పడింది. వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

సాధారణంగా జగన్ హామీ ఇచ్చారు అంటే ఖచ్చితంగా అది అమలు జరిగి తీరుతుంది. కాస్త అటూ ఇటూ అయినా సరే అమలు విషయంలో తేడా ఏమీ ఉండదు అంటున్నారు పార్టీ నాయకులు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చాక ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్. అయితే ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలోకి బదలాయించి, ఆర్టీసీ సంస్థను మాత్రం యధావిధిగా కొనసాగిస్తున్నారు.

ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉండటంతో సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్య పడలేదు. ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతారు అన్నమాట. ఆర్టీసీ సిబ్బంది వేతనాల కోసం ప్రభుత్వం దాదాపు ఏకంగా 3600 కోట్లు ఖర్చు భరించబోతోంది.

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో చేర్చడాన్ని చాలామంది తప్పుపట్టారు. అయినప్పటికీ వైయస్ జగన్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో మంత్రి పేర్ని నాని మీడియాతో తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును జగన్ ఏకంగా 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ కూడా మరో శుభవార్త అందించారు. వారికి పెన్షన్ పథకం పై కూడా జగన్ సమీక్షించారు.

కాంట్రిబ్యూటర్ పింఛను పథకం, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై కూడా ముఖ్యమంత్రి జగన్ గురువారం రోజున సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, grant-in-aid ఉద్యోగులు యూనివర్సిటీలో విద్యాసంస్థల్లో కలిపి మొత్తం ఒక లక్షా తొంభై ఎనిమిది వేల 221 మంది సిపిఎస్ పరిధిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వీరిలో ఒక లక్షా 75 వేల 705 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారట. అయితే ఏ పెన్షన్ విధానంలో వీరికి ఎంత ఖర్చవుతుందో కూడా సీఎంకు వివరించారు. కమిటీ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసినా వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటన్నిటినీ అమలు చేసామన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కూడా న్యాయపరమైన చిక్కులు ఉండటంతో వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరేలా విధివిధానాలు అన్నీ రూపొందించబోతున్నట్టు జగన్ వారికి తీపి కబురు అందించారు. దీపావళి పండుగ ముందురోజు ఆర్టీసీ వారికి గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడు అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు.

ప్రతి ఆర్టీసీ కుటుంబసభ్యులలో కూడా ఆనందం వ్యక్తం అవుతోంది. ఏదైనా ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ చేస్తున్న పనులు చూస్తుంటే పక్క రాష్ట్రాల్లో సైతం ఇరుకున పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Leave a Comment