నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ ఖరారు కావడంతో మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇదివరకు చాలాసార్లు ఢిల్లీ వెళ్లే ప్రయత్నం చేసినా, రాష్ట్రంలోని పలు సంక్షేమ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో వాయిదా పాడేది. (ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్ . )
కానీ ఈరోజుకు పర్యటన ఖరారు చేసుకున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి నేటి మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీకి బయలు దేరనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. సాయంత్రం ఢిల్లీలో అమిత్ షా తో ఏపీ సీఎం భేటీ కానున్నారని అధికార వర్గాలు తెలిపిన సమాచారం.
రాత్రికి ఢిల్లీలోనే వైఎస్ జగన్ బసచేసి, అనంతరం బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా తిరుపతి వెళ్లనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పుణ్యక్షేత్రం అయిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బుధవారం రాత్రి తిరుమలలోనే ఏపీ సీఎం బస చేయనున్నారని తెలుస్తోంది. మరుసటి రోజు కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో చేపట్టబోయే భవన నిర్మాణానికి జరిగే భూమి పూజలో కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి వైఎస్ జగన్ పాల్గొంటారు.
కాగా, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు ఏపీ పోలీస్ సేవా యాప్‌ను ఆవిష్కరించడం తెలిసిందే. దేశంలోనే సరికొత్తగా ఏపీ పోలీస్ సేవా యాప్‌ను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్‌కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …