జగన్ దూకుడును అంచనా వేయలేకపోతున్న ప్రతిపక్షం..

ఒక పనిని అనుకుంటే ఆ పనిని పూర్తి చేయటంలో జగన్ ని మించిన వారు లేరు అనే విషయం ఇప్పటికే తన పనితీరుతో స్పష్టంగా ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేలా చేశాడు జగన్. మరి అలాంటి జగన్ ఇప్పుడు మరో బృహత్తర ప్రణాళికను సిద్ధం చేశారు. దాని వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.

వచ్చే నెల 10వ తేదీ నాటికి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల అన్నిటిలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్ డెస్క్ లు, సీసీ కెమెరాలు ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

స్పందన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య మిత్రులు ఏం చేయాలన్నా దానిపై ఒక నిర్దిష్ట SOP ఏర్పాటు చేయాలని సూచించారు.

ఆరోగ్య ఆసరా ఎలా అమలవుతుందన్నది జేసీలు చూడాలన్నారు. ఆస్పత్రిలో 9,800 పోస్టులు మంజూరు చేశామని.. వాటిలో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో 7700 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా ఇప్పటికే 5790 ఈ పోస్టులు భర్తీ అయ్యాయి అన్నారు. మిగిలిన పోస్టులు కూడా త్వరగా భర్తీ చేసేలా కలెక్టర్ల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జగనన్న తోడు పథకం నవంబర్ 25న ప్రారంభం అవుతోందని.. ఈ పథకంలో ఇప్పటివరకూ 6.29 లక్షల దరఖాస్తులకు బ్యాంకులు టయ్యప్ అయ్యాయని చెప్పారు.మిగిలిన దరఖాస్తులను కూడా వెంటనే బ్యాంకులకు పంపాలన్నారు.

ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బికె యూనిట్లు, వై ఎస్ ఆర్ ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లకు ప్రహరీ నిర్మాణం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి కావాలన్నారు. బీఎంసీల నిర్మాణ పనులు వచ్చే నెల 15వ తేదీ నాటికి మొదలు కావాలని.. ప్రతి నియోజకవర్గంలో 10 కోట్ల విలువైన పనులు చేయాలని అన్నారు.

సకాలంలో పూర్తి చేస్తే అదనంగా మరో ఐదు కోట్ల విలువైన పనులు వస్తాయన్నారు. నాడు నేడు కింద తొలిదశలో 15715 స్కూళ్లలో పనులు చేపట్టగా 78 శాతం పూర్తయి డిసెంబర్ 31 టార్గెట్ గా పనులు పూర్తి చేసేలా చూసే బాధ్యత జేసీలు తీసుకోవాలన్నారు.

రబీ సీజన్ కు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల లోటు లేకుండా చూడాలని సీఎం యాప్ ఈ క్రాప్ నమోదు పై జేఏసీలు, కలెక్టర్ల దృష్టి పెట్టాలన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలోని కాలువలో గుర్రపుడెక్కను తొలగించి నీరు సాఫీగా పడేలా చర్యలు చేపట్టాలన్నారు.

పోలవరం కాపర్ డ్యాం పనులు దృష్ట్యా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో డిసెంబర్ 31 లోగా రబీకి సంబంధించి వరి నాట్లు, ఇతర పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పనులు బాగా జరుగుతున్నాయని.. దాదాపు 150 కోట్ల విలువైన పనులు ఒక్కో వారం జరుగుతున్నాయన్నారు.

కేవలం 150 కోట్లు మాత్రమే బకాయిలు ఉండగా కొన్ని వార్తా పత్రికలు తప్పుడు వార్తలు రాస్తోందని కూడా మండిపడ్డారు. గ్రామాల్లో పనులకు ఎవరూ రాకుండా కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. బిల్లులు ఇవ్వడం లేదని తప్పుడు వార్తలు రాస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

మరి అన్ని రకాలుగా ప్రజలకు కావలసిన ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా పరిశీలిస్తున్నారు అనే విషయాలు మనకు అర్థమవుతుంది. ఒక ప్రణాళికను లేదా ఒక పథకాన్ని ప్రవేశపెట్టామా అది అయిపోయిందా అన్నట్టు కాకుండా దానికి సంబంధించి జరుగుతున్న గ్రౌండ్ వర్క్ గురించి, అదే విధంగా దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అనే విషయాల గురించి ఒక ముఖ్య మంత్రి పట్టించుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.

Leave a Comment