Youtube deleted 10lack videos | యూట్యూబ్ 10 లక్షల వీడియోలు తొలగించినట్లు గా పేర్కొంది. కరోనాకు సంభందించిన జాగ్రత్తలు, కరోనా వ్యాక్సినేషన్, కరోనా లక్షణాలు ఇలా కరోనాకు సంబంధించిన చాలా వీడియోలు Youtube లో అందుబాటులో ఉన్నాయి. కానీ అందులో కొన్ని వీడియోలు కోవిడ్ కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని పొందుపరిచాయని యూట్యూబ్ గుర్తించింది.
ఫిబ్రవరి 2020 నుంచి ఇప్పటివరకు Covid-19 మీద అప్లోడ్ అయినటువంటి వీడియోలలో తప్పుడు సమాచారం ఉన్న ఒక మిలియన్ వీడియోలను Youtube తాజాగా తొలగించింది. నిజానికి యూట్యూబ్ ప్రతి మూడు నెలలకు ఒకసారి పది మిలియన్ల వరకు వీడియోలను తొలగిస్తుందట. ఇలాంటి తప్పుడు సమాచారం ఉన్న వీడియోలు, వ్యూస్ లేని వీడియోలు యూట్యూబ్ రూల్స్ ను అతిక్రమించడం లాంటి కారణాలతో ప్రతి మూడు నెలలకు కోటి వీడియోల వరకు delete చేస్తోందట.
- మా బాబుగారు సింహంలా ఢిల్లీ వస్తే ఎవరూ పట్టించుకోరే.. !
- పాకిస్తాన్ లో తాలిబన్ జెండాలు.. ఉలిక్కిపడ్డ ఇమ్రాన్ ఖాన్
- పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ రాజీనామా..!
- చైనా గుప్పెట్లోకి శ్రీలంక దీవులు..భారత్ కు ముప్పు పొంచిఉందా ..?
- IT Rides on Sonu sood | సోనూసూద్ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ దాడులు.. అందుకేనా.. !
అయితే ఈసారి కేవలం కరోనాకు సంబంధించిన తప్పుడు సమాచారం ఉన్న పది లక్షల వీడియోలను Youtube delete చేసినట్లుగా యూట్యూబ్ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ నెల్ మోహన్ ( Neal Mohan ) వెల్లడించారు. యూట్యూబ్ లో ఉండే బిలియన్ వీడియోలలో బ్యాడ్ కంటెంట్, తప్పుడు సమాచారం ఉన్న వీడియోల శాతం చాలా తక్కువగా ఉంటుంది. మొత్తం వ్యూస్ లో 16 నుంచి 18 శాతం వ్యూస్ మాత్రమే యూట్యూబ్ పాలసీలను ఉల్లంఘించే వీడియోల ద్వారా వస్తాయని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
More Latest telugu news today, Online telugu news today, Political news, online news today