కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

ఆదివారం నాడు ఖుషి నగర్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. వచ్చే ఏడాది ప్రారంభంలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగారు యోగి ఆదిత్యనాథ్. ఉగ్రవాదానికి మాతృమూర్తి కాంగ్రెస్ పార్టీ అని.. శ్రీరాముడుపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఆ పార్టీ కించ పరిచిందని ఈ సందర్భంగా ఆరోపించారు. దేశానికి నష్టం కలిగిస్తున్న వారిని సహించాల్సిన అవసరం లేదని తెలిపారు.

కాంగ్రెస్ వ్యాధులు తీసుకొస్తుందని.. మాఫియాకు షెల్టర్ ఇస్తుందని ధ్వజమెత్తారు. కానీ ప్రజలకు అయిన గాయాలను బిజెపి నయం చేస్తుందని.. వారి కష్టాలు పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. బిజెపి ఉన్నచోటే ప్రతి ఒక్కరికీ గౌరవం ఉంటుంది అని ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. వ్యాధులు, నిరుద్యోగం, మాఫియా రాజ్యం, అవినీతి.. కాంగ్రెస్ పార్టీ పుణ్యమే అని ఆయన తెలిపారు. ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాలు రాష్ట్రానికి చేసిందేమిటని ఆయన ప్రశ్నించారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో బుజ్జగింపు రాజకీయాలకు చోటు లేదని స్పష్టం చేశారు. 2017 ముందు ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులు అందేవా అని నిలదీశారు. పాలకులకు జై కొట్టిన వారికే రేషన్ సరుకులు ఇచ్చేవారని ఆరోపించారు. తాలిబన్ అనుకూల కుల వారసత్వ రాజకీయాలను ఉత్తరప్రదేశ్ ప్రజలు సహించబోరని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.

బుజ్జగింపు రాజకీయాలకు, అవినీతికి ప్రతిపక్ష పార్టీలు పెట్టింది పేరని మండిపడ్డారు. ఈ దేశాన్ని ముందు బ్రిటిష్ వాళ్ళు లూటీ చేయగా.. తరువాత ఆ పని కాంగ్రెస్ పార్టీ చేసిందని ధ్వజమెత్తారు. రాముడిపై నెహ్రూకు నమ్మకం లేదని.. సాదువులపై ఇందిరాజీ కాల్పులు జరిపించారని.. శ్రీరాముడి ఉనికిని సోనియాజీ అంగీకరించారని ఆరోపించారు. ( గుజరాత్ లో బీజేపీ పట్టుకోల్పోతోందా .. ? )

యోగి ఆదిత్యనాథ్ కామెంట్స్ పై ప్రతిపక్షాల స్పందన

ఇలా కాంగ్రెస్ పార్టీపై చేసిన యోగి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. యోగి చేసిన ఈ కామెంట్ల పై విపక్షాలు సైతం ధీటుగా స్పందిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు ఇవి కావు అంటూ ఎద్దేవా చేస్తున్నాయి.

మరోవైపు రాబోయే ఎలక్షన్ ను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే యూపీలో 80 లోక్సభ స్థానాలు ఉండటమే దీనికి గల కారణం. 403 అసెంబ్లీ స్థానాలు యూపీలో ఉన్నాయి. ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతోంది బిజెపి. వచ్చే ఏడాది నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యానికి తేరా దించడానికి ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే పక్కాగా స్కెచ్ వేసి ఇప్పటికే వాటిని అనుసరిస్తున్నాయి. ( ఢిల్లీలో కాంగ్రెస్ )

Priyanka Gandhi Vaadra

కాగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఉత్తరప్రదేశ్లో మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకోవడానికి కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రియాంక గాంధీ వాద్రాను బరిలోకి దించింది కాంగ్రెస్. ప్రస్తుతం ఆమె తూర్పు ప్రాంత పార్టీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆమె సారథ్యంలోనే ఒక భారీ ప్రదర్శనకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్. ప్రతిజ్ఞ యాత్రపేరుతో రాష్ట్రం మొత్తం తిరగబోతోంది.

ఈ యాత్ర ఈనెల 20వ తేదీన ప్రారంభం కానుంది. దీనికి ప్రియాంక గాంధీ వాద్రా సారథిగా నిర్వహిస్తారు. ప్రతి మారుమూల గ్రామాన్ని కూడా పలకరించేలా.. కాంగ్రెస్ నాయకులు అడుగు పెట్టేలా దీన్ని రూపొందించారు. మిగిలిన విపక్షాలు సైతం తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ రాజకీయ చదరంగం యూపీలో రానున్న రోజుల్లో ఎటువంటి మలుపులు తిప్పనుందో చూడాలి.

1 thought on “కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్”

Leave a Comment