Yediyurappa | యడ్యూరప్ప పదవీకాలం ఎప్పుడూ అసంపూర్ణమే..!

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప ( B.S. Yediyurappa ) నేడు తన పదవికి రాజీనామా చేశారు. నాల్గవ సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండు ఏళ్ళు అయిన సందర్భంగా విధాన సౌధలో జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్ర గవర్నర్ గెహ్లాట్ ను కలిసి తన రాజీనామాను సమర్పించగా వెంటనే ఆయన ఆమోదం తెలిపారు. అయితే తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు రాష్ట్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాలని ఆయన సూచించారు.

సరిగ్గా పది సంవత్సరాల క్రితం

కర్ణాటకలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా పేరొందిన ఎడ్యూరప్ప, దక్షిణాఢీలో తొలిసారిగా కర్ణాటకలో బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత దక్కించుకున్న వ్యక్తి. ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టినా ఎప్పుడూ పూర్తి కాలం పదవిలో ఉండలేకపోయారు. సరిగ్గా పదేళ్ల క్రితం జూలై చివరి వారంలోనే ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడం గమనార్హం. బిజెపిలో 75 ఏళ్ల వయసు దాటిన వారు ఎవరూ కూడా పార్టీలో.. ప్రభుత్వంలో ఎటువంటి పదవులు చేపట్టరాదనే నిబంధనను అనధికారికంగా అమలు పరుస్తున్న బీజేపీ నాయకత్వం అభేష్టం మేరకు ఆయన రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆయన వయసు ఇప్పుడు 78 ఏళ్ళు. పార్టీ నిబంధనలు పక్కనపెట్టి ఇంతకాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగించడం ద్వారా పార్టీ నాయకత్వం తన పట్ల ఎంతో ప్రేమ చూపించిందని గతవారమే ఆయన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. తనకు పదవి కన్నా పార్టీ, ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశమైన సందర్భంగా ఆయన రాజీనామా అంశం ప్రస్తావనకు వచ్చినట్టుగా కథనాలు వెలువడ్డాయి.

అయితే ఆయన అభేష్టం మేరకు రెండేళ్లు పూర్తి చేసుకున్న తరువాతనే రాజీనామా చేశారు. కాగా కర్ణాటక రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే విషయంలో తాను ఎవరి పేరు సిఫారసు చేయబోనని రాజీనామా అనంతరం ఎడ్యూరప్ప చెప్పారు. తన రాజీనామా కోసం ఎవరు ఎలాంటి ఒత్తిడి చేయలేదని.. కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసం తానే స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగాలని ఆయన స్పష్టం చేశారు. అధిష్టానం కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించినా.. తాము అతని నాయకత్వంలో పని చేస్తామని ఎడ్యూరప్ప భరోసా వ్యక్తం చేశారు. తాను నూటికి నూరు శాతం కొత్త ముఖ్యమంత్రికి సహకరిస్తారని, అదేవిధంగా తన మద్దతు ధరలు కూడా వచ్చే సీఎంకు 100% సహకారం అందిస్తారని ఎడ్యూరప్ప స్పష్టం చేశారు.

పార్టీ విధేయుడిగా Yediyurappa

తిరగడానికి వాహనాలు కూడా లేని రోజులలో సైకిల్ పై తిరుగుతూ పార్టీ కోసం పని చేసానని చెప్పారు. అటల్ బిహారీ వాజ్ పేయి, మురళి మనోహర్ జోషి వంటి నేతల స్ఫూర్తితో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసినట్టుగా చెప్పుకొచ్చారు. ఇక ఎడ్యూరప్ప రాజీనామాతో ఆయన సొంతూరు ప్రజలు నిరాశ చెందారు. Yediyurappa మద్దతుదారులు స్వచ్ఛందంగా షాపులు మూసి బంద్ పాటించారు. అనంతరం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బిజెపి అధిష్టానం ఎడ్యూరప్పతో బలవంతంగా సీఎం పదవికి రాజీనామా చేయించిందని సొంతూరు షికారిపురలో ఆయన మద్దతుదారులు మండిపడ్డారు.

అనంతరం ఎడ్యూరప్పకు అనుకూలంగా, బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. Yediyurappa రాజీనామా ప్రకటన నేపథ్యంలో కర్నాటక కొత్త సీఎం ఎవరు అన్నదానిపై ఇప్పుడు ఊహాగానాలు మొదలయ్యాయి. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఎడ్యూరప్పతో రాజీనామా చేపిస్తున్న నేపథ్యంలో అదే వర్గానికి చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యేకు సీఎం పదవి కట్టబెట్టేందుకు అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో పలు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ఎనిమిది మందితో ఓ జాబితా తయారు చేసిన అధిష్టానం వీరిలో ఒకరిని సీఎంగా ఎంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

1 thought on “Yediyurappa | యడ్యూరప్ప పదవీకాలం ఎప్పుడూ అసంపూర్ణమే..!”

Leave a Comment