షియోమి నుండి Mi tv stick తక్కువ ధరలో..

Mitv Stck

ఇప్పుడు మార్కెట్ లోకి కొత్తగా షియోమి నుండి Mi tv stick అతి తక్కువ ధరలో ( రూ. 2799 )లభిస్తుంది. ఈ డివైస్ మీయొక్క పాత LCD టీవీని కూడా స్మార్ట్ టీవీగా మారుస్తుంది. ఇప్పటికే ఇటువంటి ఆప్షన్ తో చాల డివైస్ లు వచ్చినప్పటికీ షియోమి కంపెనీ నుండి తక్కువ ధరలో అందుబాటులోకి రానుంది.

ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు 8gb ram కలిగివున్న ఈ డివైస్ మీ టీవీని త్వరగా స్మార్ట్ మోడ్ లోకి మారుస్తుంది. HDMI సపోర్ట్ తో వుండే ఈ డివైస్ వైఫై కి అనుసంధానం చేయడంతో ఫుల్ హెచ్ డి దృశ్యాలను మీ టీవీ లో వీక్షించవచ్చు. ఇది యూట్యూబ్, netflix, అమెజాన్ ప్రైమ్ వంటి మరెన్నో స్ట్రీమింగ్ వీడియో అప్లికేషన్స్ కలిగివుంది.

Dolby Dts, క్రోమ్ కాస్ట్ మరియు గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచర్స్ దీనిలో వున్నాయి. క్రోమ్ కాస్ట్ ఫీచర్ ద్వారా మీ మొబైల్ని టివి కి స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు. అలాగే దీనిని మానిటర్ కి లేదా ప్రొజెక్టర్ కి కనెక్ట్ చేసుకోవడం ద్వారా వాటిని స్మార్ట్ గా మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది అమెజాన్ tv stick కి గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. దీనితో పాటు పవర్ అడాప్టెర్, బ్లూ టూత్ రిమోట్ కూడా ఇవ్వడం జరిగింది.

Leave a Comment