కార్పొరేట్ రంగంలోని కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకాల పేరిట అవసరానికి ఆదుకుంటూ పెద్ద మనసును చాటుకున్నాయి. కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది.వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఆఫీస్ కి వెళ్లే పని లేకుండా హాయిగా ఇంటి నుంచే చేసుకోవచ్చు అని అనుకుంటారు చాల మంది. కానీ ఆఫీస్ లో మాదిరిగా ఇళ్లల్లో పని చేసేందుకు అనుకూలంగా పూర్తి స్థాయి సదుపాయాలు ఉండవు.
దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న వారు తమకు వెన్ను భాగంలో నొప్పి వస్తోందంటూ తమ ఇబ్బందులను తెలియజేస్తున్నారు. ఈ సమస్యను కంపెనీలు యజమానులు అర్థం చేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ప్రత్యేక అలవెన్స్ ఇవ్వడం మొదలు పెట్టాయి.
దీనివల్ల ఉద్యోగులు ఇంట్లోనే కుర్చీ, టేబుల్ తదితర సదుపాయాలను సమకూర్చుకుని సౌకర్యంగా పనిచేయగలరని వాఋ భావిస్తున్నారు. ఉద్యోగులు సౌకర్యంగా పనిచేయగలిగినప్పుడే కంపెనీలు తమ ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయగలుగుతాయి. అందుకే కంపెనీ యాజమాన్యాలు ఈ విషయంలో కాస్త విశాలంగా ఆలోచించాయి.
గూగుల్, ఇక్సిగో, సేల్స్ ఫోర్స్, రేజర్ పే, వెరిజాన్ ఇండియా.. ఇవన్నీ కూడా తమ ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్స్ ను ప్రకటించిన వాటిల్లో ఉన్నాయి. ఈ అలవెన్స్ తో సౌకర్యవంతమైన చైర్, ఇతర పరికరాలు కొనుగోలు చేసుకోవాలన్నది కంపెనీల సూచన.
‘‘వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యూ ఎఫ్ హెచ్) అన్నది ఎక్కువ కాలం పాటు ఉంటుందన్నది మా అవగాహన. దీంతో మా ఉద్యోగులు ఇంటి నుంచే సంతోషంగా పనిచేసేందుుకు వీలుగా తగిన వసతులు వారు కల్పించునే విధంగా చూడాలనుకున్నాము’’ అని ఫ్రెష్ వర్క్స్ హ్యుమన్ రీసోర్సెస్ చీఫ్ సుమన్ గోపాలన్ వెల్లడించారు.
కరోనా వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తుండడంతో నివారణ చర్యల్లో భాగంగా చాలా కంపెనీలు 80 శాతం మేర ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కి అవకాశం కల్పించాయి.
ఇంటి నుంచి పని చేసే తమ ఉద్యోగులకు ఏమేమి అవసరమో తెలుసుుకునేందుకు బేయర్ గ్రూపు అయితే ప్రత్యేకంగా ఒక సర్వే నిర్వహించింది.
‘‘సర్వే ఫలితాల ఆధారంగా ఆఫీస్ పరికరాలైన హెడ్ ఫోన్లు, కీబోర్డు, మౌస్, ల్యాప్ టాప్ స్టాండ్, వెన్నెముకకు మద్దతునిచ్చే పరికరాలను ఉద్యోగులకు అందించాము’’ అని బేయర్ గ్రూపు దేశీయ హెచ్ ఆర్ హెడ్ కేఎస్ హరీష్ తెలిపారు. డెస్క్ టాప్ మానిటర్లు, చైర్లను కూడా ఈ సంస్థ ఉద్యోగులకు సమకూర్చడం విశేషం.
ఫర్నిచర్ కంపెనీలకు పెరిగిన వ్యాపారం
ఆఫీస్ ఫర్నిచర్ తయారు చేసే కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇంట్లోనే పని చేసేందుకు అనుకూలించే ఉత్పత్తులను అవి మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. ‘‘హోమ్ ఆఫీస్ సొల్యూషన్స్ విక్రయాలు సాధారణ రోజులతో పోలిస్తే గత కొన్ని నెలల్లో ఐదు రెట్లు పెరిగాయి. ఉద్యోగులు దీన్ని అర్థం చేసుకున్నారు కనుకనే వర్క్ ఫ్రమ్ హోమ్ పరికరాలకు డిమాండ్ అంతగా పెరిగింది’’ అని గోద్రేజ్ ఇంటీరియో మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సమీర్ జోషి వివరించారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …