ఇది కలియుగం.. ఇక్కడ అన్ని వైపరీత్యాలే ఎక్కువ. ఒక నానుడి ఉంది, ఎవరి పాపాన వారు పోతారు అని, కానీ ఇప్పుడలా లేదు.. పక్కోడి పాపానికి వేరొకరు బలవుతున్నారు. చైనా చేసిన పాపానికి మిగతా దేశాలు ఎఫెక్ట్ అయినట్టుగా, మనుషులు చేసే తప్పిదాల వల్ల ఇప్పుడు మూగ జీవుల మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి.
covid-19 ఈ వ్యాధికి ప్రస్తుతానికి ఒక్క మంది కూడా లేరు. వాక్సిన్ ల ప్రయోగాలు వివిధ దేశాలలో వందల సంఖ్యలో లేబరేటరీలో శాస్త్రవేత్తలు తమ పనుల్లో మునిగి ఉన్నారు. ఇదే ఇప్పుడు అంతరించిపోయే ప్రమాదం ఉన్న అరుదైన షార్క్ చేపలకు గండంగా మారుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే, covid-19 వాక్సిన్ తయారీకి వేల సంఖ్యలో షార్క్ చేపలు సామూహికంగా చంపుతున్నారనే విషయం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. షార్క్ అంటే సొరచేప. వీటి కాలేయం నుంచి లభించే నేచురల్ ఆయిల్ సమ్మేళనాన్ని స్క్వాలిన్ అంటారు. దీన్ని ఇప్పుడు కరోనా టీకాల తయారీలో ఉపయోగిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న టీకాలకు అవసరమయ్యింత స్క్వాలిన్ సేకరించాలంటే వేలల్లో సొరచేపలు చంపాల్సి ఉంటుంది. వాక్సిన్ తీసుకున్న వారిలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ స్క్వాలిన్ తోడ్పడుతుంది. టీకా సామర్థ్యాన్ని కూడా ఇది బలోపేతం చేస్తుంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ దారుణానికి ఒడిగడుతున్నాడు ఈ మానవుడు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ, RAPS ప్రచురించిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 176 వరకు కరోనా వాక్సిన్ లను అభివృద్ధి చేస్తున్నారు. వాటిలో సుమారు 17 వరకు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రయోగిస్తున్నారు. వీటిలో కనీసం 5 వాక్సిన్ లను షార్క్ స్క్వాలియాన్ ఆధారంగా అభివృద్ధి చేస్తున్నట్లుగా అమెరికాకు చెందిన షార్క్ అలిస్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఈ సంస్థ సొరచేపల సంరక్షణ కోసం పని చేస్తుంది.
ఈ వాక్సిన్ మంచి ఫలితాలు ఇచ్చి వాటిని ఈ ప్రపంచం మొత్తానికి అందించాలంటే టన్నుల కొద్దీ స్క్వాలిన్ అవసరమవుతుంది. దీని కోసం కొన్ని లక్షల సొరచేపలను బలితీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. సాధారణంగా ఒక డోసు టీకాకు సుమారుగా 9.75 మిల్లీగ్రాముల స్క్వాలిన్ అవసరం. ఈ లెక్కన చూస్తే భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి ఒక డోసు టీకా కావాలంటే రెండు లక్షలకు పైగా సొర చేపలను చంపాల్సి ఉంటుంది.
దీనిని అరికట్టలేమా
రోగ నిరోధక శక్తిని పెంచడానికి డోసులను ఎక్కువగా ఇస్తే , సుమారు 5 లక్షల సొరచేపలు చంపాల్సిందే. ఇప్పటికే కొన్ని రకాల సొరచేపలు అంతరించే దశకు చేరుకున్నాయి. మహమ్మారికి విరుగుడుగా మానవాళికి టీకా అందుబాటులోకి రావాలంటే ఈ జీవజాతులను చంపడం సరికాదని మరోవైపు శాస్త్రవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమ అవసరాల కోసం ఇప్పటికే సొరచేపలను పెద్ద మొత్తంలో వేటాడుతున్నారు.
సౌందర్య ఉత్పత్తుల్లో వాడే సౌలభ్యం కోసం ఇప్పటికే 2.7 మిలియన్ సొరచేపలను వేటాడినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2020-2027 నాటికి ఈ సంఖ్య రెండు మూడు రెట్లకు పెరిగిపోయే అవకాశం కనిపిస్తోందని వారు అంచనా వేస్తున్నారు. దాదాపుగా పది లక్షల వరకు సొరచేపలను వాటి రెక్కలు కోసం వేటాడుతున్నట్లు అంచనా. ఇలాంటివన్నీ కలిసి సొర చేపల మనుగడకు ముప్పుగా మారాయి.
మరోవైపు సొర చేపలను సంరక్షించడానికి కొంతమంది శాస్త్రవేత్తలు స్క్వాలిన్ను కృత్రిమంగా తయారుచేస్తున్నారు. గోధుమ, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి వాటి నుంచి ప్లాంటు బేస్డ్ స్క్వాలిన్ ను తయారు చేస్తున్నారు. అయినా ఇటువంటి కృత్రిమ పద్ధతులు పాటించేందుకు కొన్ని వాక్సిన్ తయారీ సంస్థలు ఆసక్తి చూపించడం లేదు. అందువలన లక్షల సంఖ్యలో అరుదైన ఈ సొరచేపల జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఈ కరోనా రక్కసి ఇంకెన్ని దుర్మార్గాలు చేస్తుందనే భయం విషయం ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది అన్నది నిజం.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …