సీఎం జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేకపై ఊహించినట్లే జరుగుతోంది. సీఎం జగన్ తాను రాసిన లేఖను బహిరంగ పరచడంతో దేశం మొత్తం దీనిపైనే చర్చ సాగుతోంది. సుప్రీంకోర్టులో నెంబర్ 2 స్థానంలో ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ పై, ఏపీ హైకోర్టు న్యాయవాదులు పైన ఫిర్యాదు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకుంటారని రాజకీయ నిపుణులు, విశ్లేషకులు, అన్ని రాజకీయ పక్షాలు, సామాన్య ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
జాతీయ మీడియాలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ కూడా జరుగుతోంది. అన్ని రాష్ట్ర హైకోర్టులో కూడా అంతర్గతంగా న్యాయవాదుల మధ్య ఇదే అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే రెండు రోజులుగా ఢిల్లీలో చాపకింద నీరులా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ రాసిన లేఖ ఓవైపు న్యాయవ్యవస్థలో చర్చనీయాంశం కావడమే కాదు.. రాజకీయంగా ఇదో పెద్ద డిబేట్ పాయింట్ గా మారింది.
ఈ లేఖపై జగన్ చేసిన ఆరోపణలు, పొందుపరచిన ఆధారాలు, జడ్జీల తీరు వంటి అంశాలపై ఇప్పుడు కేంద్రం కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే జగన్ దీనిపై రాష్ట్రపతి, ప్రధాని మోదీ కి వినతి పత్రాలు అందిస్తారు అన్న ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలోనే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం విశేషం. ఢిల్లీ నుంచి వచ్చిన అత్యవసర కాల్ కారణంగా జగన్ విజయసాయి రెడ్డిని పంపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం విశాఖలోనే ఉన్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండాలని భావించారు. జగన్ నుంచి వచ్చిన ఆదేశాలతో విజయసాయిరెడ్డి తన పర్యటనను రద్దు చేసుకుని వెంటనే ఢిల్లీకి బయలుదేరారు. విజయవాడకు వచ్చి కొందరు న్యాయ నిపుణుల్ని తీసుకుని వెళ్లారు.
ఢిల్లీలో బుధవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లేఖ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా పూర్తి స్థాయిలో ఆరాతీస్తోంది. అందులో జగన్ పేర్కొన్న ఆరోపణలు, ప్రస్తావించిన ఆధారాలు అన్నింటిపైనా కేంద్ర నిఘా వర్గాలు విచారణ జరుపుతున్నట్టు సమాచారం. ఎంపీ విజయసాయిరెడ్డి కూడా జగన్ తరఫున ఈ వివాదంపై కేంద్రంలోని ప్రముఖులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నారు.
దీంతో జగన్ రాసిన లేఖపై ఢిల్లీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ కూడా మరోమారు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధం కావడం, రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు ప్రయత్నించడం, ఈ లోపే పరిణామాలన్నీ చోటుచేసుకోవడంతో ఈ అంశంపై ఉత్కంఠ నెలకొంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …