ఆక్సిజెన్ లెవెల్స్ తగ్గటానికి కారణం అదేనా.. మరి ఏం చేయాలి… ?

ఆక్సిజెన్ లెవెల్స్ తగ్గటానికి కారణం : కొందరిలో స్వతహాగా చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడటం, ప్రతిదీ బూతద్దంలో పెట్టి గమనించటం అలవాటుగా ఉంటుంది. ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. కొందరిలో భయం బాగా ఎక్కువగా ఉంటుంది.

ఈ టెన్షన్, భయము, మానసిక ఒత్తిడి.. ఇలాంటి వాటివల్ల మన శరీరంలో రక్షణ వ్యవస్థ చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ప్రధానంగా అది గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించి మన ఊపిరితిత్తులను ( LUNGS ) డ్యామేజ్ చేస్తుంది.

మీరు భయపడుతున్నా.. టెన్షన్ పడుతున్నా జరిగేది అదే

సాధారణంగా టెన్షన్ వచ్చినా.. భయపడుతున్నా .. ఖంగారు పడుతున్నా.. ఇటువంటి సందర్భాల్లో శ్వాసనాళాలు ముడుచుకుంటాయి. శ్వాసనాళాల గాలి గొట్టాలలో ఉండే కండరాలు టెన్షన్ కు, భయానికి గురి అయినప్పుడు అవి ముడుచుకుంటాయి. ఈ శ్వసనాళాలు సంకోచం చెందినపుడు మంచి గాలి లోపలికి వెళ్ళటం, వ్యాకోచం చెందేటప్పుడు వ్యర్ధ వాయువు బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. ( Ayurveda medicine Online )

ఇలా శ్వసనాళాలు సంకోచం,వ్యాకోచం జరగడానికి వాటి అంచులకు వుండే కండరాలు ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనం కంగారు పడినా, భయపడినా కండరాలు ముడుచుకొని మళ్ళీ తెరుచుకోవు. ఆ సమయంలో ఊపిరితిత్తులలోకి గాలి వెళ్లడం అనేది తగ్గిపోతుంది.

అప్పుడు లోపల ఉండే సూక్ష్మ మూల వైరల్ ఇన్ఫెక్షన్లు ఉత్పత్తయ్యేవి ఆవిరి కావు. అవి లోపల ఎక్కువగా పేరుకొని అక్కడే నిలవ ఉంటే ప్రాణవాయువు లోపలికి వెళ్లకుండా ఆపుతుంటాయి. శ్వాసనాళాలు ముడుచుకునెలా చేస్తుంది మన భయం.. టెన్షన్. ఇలా టెన్షన్ మరియు భయపడేవారికే ఎక్కువగా నష్టం జరుగుతూ.. ఆక్సిజెన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి.

చివరికి హాస్పిటల్ లో అడ్మిట్ అయి కృత్రిమంగా ఆక్సిజెన్ పెట్టించుకునే పరిస్థితికి చేరుకుంటారు. భయము, టెన్షన్ పడేవారే వెంటిలేటర్ పోజిషన్ కి వెళ్లడం.. చివరికి చనిపోవడం కూడా జరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మానసిక ఒత్తిడి , భయము, టెన్షన్ కలిగినప్పుడు బ్యాడ్ హార్మోన్స్ విడుదల అవుతాయి. వీటివలన శరీరంలో ఇమ్మ్యూనిటి తగ్గిపోతుంది.

మరి ఏం చేయాలి… ?

ఇలాంటి పరిస్థితుల్లో వారికి కానీ, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా వైరస్ భారిన పాడినప్పుడు.. తమకు, తమవారికి ఎమన్నా అవుతుందోనని ముందే నెగటివ్ గా ఆలోచిస్తూ కంగారు పడిపోతూ వుంటారు. అలా ఎప్పుడూ కంగారు పడకూడదు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ పాజిటివ్ గా ఆలోచించినపుడే మనలో మంచి హార్మోన్స్ విడుదల అవుతాయి. ( గాలి ద్వారా ఎక్కువగా )

ఈ హార్మోన్స్ వలన ఊపిరితిత్తుల శ్వసనాళాలు వ్యాకోచిస్తాయి. అప్పుడు త్వరగా ఇన్ఫెక్షన్ నుంచి బయట పడతారు. ఎప్పుడైతే మనకు సరిపడా ఆక్సిజెన్ అందుతుందో రక్తప్రసరణ బాగా జరిగి అన్ని అవయవాల పనితీరు మెరుగు పడుతుంది.

రక్త ప్రసరణ సరిగా జరగకపోతే ఇమ్మ్యూనిటి తగ్గి ఇన్ఫెక్షన్ తగ్గటానికి చాలా సమయం పడుతుంది. అందువలన ఎవరు ఇన్ఫెక్షన్ కి గురైనా కంగారు పడకుండా , భయపడకుండా పాజిటివ్ ఆలోచనలతో వున్నప్పుడే శరీరం, మనసు కుదుట పడుతుంది.

దీనికి తోడు రోజు మెడిటేషన్ మరియు ప్రాణాయామం చేయడం వలన కూడా ఈ టెన్షన్, భయాలు తగ్గించుకోవచ్చు. మీతో నెగటివ్ గా మాట్లాడే వారి జోలికి వెళ్లకుండా మెడిటేషన్ వీడియోలు చూడటం,మంచి పుస్తకాలు చదవటం చేస్తూ వుండండి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలుచేస్తాయి.

1 thought on “ఆక్సిజెన్ లెవెల్స్ తగ్గటానికి కారణం అదేనా.. మరి ఏం చేయాలి… ?”

Leave a Comment