పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నప్పుడు ఏమైపోయారు బాబు గారు ..?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు తీయడం మొదలై చాలా కాలమే అయింది. లీటర్ పెట్రోల్ ధర 100 దాటి చాలా రోజులైంది. అలాగే గ్యాస్ ధర వందలకు వందలు పెరుగుతూ పోతోంది. కానీ ఇప్పటివరకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నేరుగా పెరుగుతున్న పెట్రోల్ ధరలను గట్టిగా ప్రశ్నించింది లేదు. కానీ కేంద్రం 5 రూపాయలు తగ్గించిన తర్వాత చంద్రబాబుకు ఊపు వచ్చేసింది. రాష్ట్రం కూడా తన వాటాగా ఏకంగా లీటరుకు 17 రూపాయలు తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఈనెల 9న రాష్ట్రంలో పెట్రోల్ బంకుల వద్ద టీడీపీ నిరసన కార్యక్రమాలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇంతకాలం మౌనంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడే ఎందుకు ఇంతగా ఊగిపోతున్నారు. ఇదే అసలు ప్రశ్న. ఇదివరకే పెట్రోల్ ధరలపై చంద్రబాబు పోరాటం చేసి ఉంటే కేంద్రానికి కోపం వచ్చి ఉండేది. ఎందుకంటే పెట్రోల్ ధరలను ఈ స్థాయిలో పెంచుతూ పోయింది మోడీ ప్రభుత్వమే. అందుకే కేంద్ర ప్రభుత్వానికి కోపం రాకూడదనే ఉద్దేశంతో ఇంతకాలం చంద్రబాబు మౌనంగా ఉంటూ వచ్చారు.

పెట్రోల్ ధరను ఏకంగా 110 రూపాయలు దాటించిన కేంద్రం

70 రూపాయల పెట్రోల్ ధరను ఏకంగా 110 రూపాయలు దాటించిన కేంద్రం, ఇప్పుడు కొద్దిగా తగ్గించడంతో బిజెపి రాజకీయ ప్రత్యర్థులపై దాడి మొదలు పెట్టింది. తనకు గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా కింద పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ ఏపీలో బీజేపీ నేతలు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

ఇలాంటి సమయంలో తాను కూడా జగన్ పైన, వైసీపీ ప్రభుత్వం పైన పోరాటం చేసినా.. వ్యతిరేకంగా మాట్లాడినా కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ పెద్దలకు కోపం రాదు అన్న భావనకు చంద్రబాబు వచ్చి ఉంటారు. అందుకే ఆదాయం లేక రాష్ట్ర అడుక్కుతిన్నా పర్లేదు.. ఏకంగా లీటరుపై 17 రూపాయలు తగ్గించాల్సిందే అంటూ చంద్రబాబు డిమాండ్ పెడుతున్నారు. ( JioPhone Next కొనాలనుకుంటున్నారా?  )

విచిత్రమేంటంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వసూలు చేస్తున్న వ్యాట్ మొత్తం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిర్ణయించిందే. రోడ్ల మరమ్మతు కోసం అంటూ జగన్ ప్రభుత్వం కేవలం ఒక్క రూపాయి మాత్రమే అదనంగా సెస్ విధించింది. మిగతాదంతా చంద్రబాబు హయాంలో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది.

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలను పరిగణలోనికి తీసుకుంటే.. కేంద్రం లీటర్ పెట్రోల్, డీజిల్ పై మరో 25 రూపాయలు తగ్గించినా నష్టమేం లేదు. ఏడాదికి ఏకంగా నాలుగు లక్షల కోట్లను పెట్రోల్, డీజిల్ ద్వారా పిండేసుకుంటున్న కేంద్రం.. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం రాష్ట్రాలను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేయడమే విచిత్రం.

Leave a Comment