చైనాను వెనకేసుకొస్తున్న WHO .. బయటపడ్డ రికార్డులు..

ప్రపంచదేశాలకు ప్రాణాంతకంగా మారిన కరోనా మహమ్మారి పుట్టింది ఎక్కడ..? ఈ ప్రశ్న ఉదయించిన ప్రతిసారి చైనాలోని వుహాన్ ల్యాబ్ మన మనసులో మెదులుతుంది. కానీ అందుకు సంబంధించిన బలమైన ఆధారాలు ఇప్పటిదాకా దొరకలేదు. ఆలా మేనేజ్ చేసింది జిత్తులమారి డ్రాగన్.

అయితే నిజం ఎప్పుడో ఓ సారి బయట పడాల్సి ఉంది కదా. ఇప్పుడు అదే జరుగుతోంది. 2019 వ సంవత్సరం డిసెంబర్ నెలలో చైనాలోని ఉహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. తాజాగా సెకండ్ వేవ్ అమెరికాతో సహా యూరప్ లోని దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పెద్ద ఎత్తున ప్రాణాలు తీస్తోంది.

గతంలో ఎన్నో వైరస్లు వ్యాప్తి చెందినా కూడా కరోనా స్థాయిలో వ్యాప్తి చెందలేదు. అయితే ఈ వైరస్ పుట్టుక గురించి శాస్త్రవేత్తల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. చాలామంది శాస్త్రవేత్తలు కరోనా వైరస్ ల్యాబ్ లో పుట్టి ఉండొచ్చని గతంలోనే అనుమానాలు వ్యక్తం చేశారు. అటు కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవహారంపై మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

WHO newsmart9

ముఖ్యంగా డబ్ల్యూహెచ్వో అధ్యక్షుడు టెడ్రోస్ అధనోమ్ వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. డ్రాగన్ ను బాహాటంగానే వెనకేసుకొచ్చిన ఆయన అసలు వైరస్ వ్యాప్తికి చైనా కారణం కానే కాదు అన్న రీతిలో మాట్లాడారు. ఇథియోపియాకు చెందిన అధనోమ్ అంతకు ముందు ఆ దేశ కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాజకీయంగా అనుభవం గడించారు.

అటు ఇథియోపియాకు చైనా అండదండలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ దేశ ప్రయోజనాల కోసం కరోనా వైరస్ విషయంలో చైనాను వెనకేసుకొచ్చారు అనే వాదనలు వినిపించాయి. అందుకే చైనాకు మేనమామ పాత్ర పోషించిన అధనోమ్ జిత్తులమారి చైనాకి అండగా నిలబడ్డారని, మహమ్మారి గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

అటు చైనా సైతం కరోనా తప్పు తమది కాదన్న రీతిలో కలరింగ్ ఇస్తూ వస్తోంది. కరోనా మహమ్మారి పుట్టింది ఉహాన్ ల్యాబ్ లోనేనని ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. కొందరు చైనా సైంటిస్టులు సైతం ఈ విషయాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు. అయితే చైనా వారందరి నోళ్ళు మూయించింది. కొందరిని హతమార్చింది కూడా. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం మొదటి నుంచి చైనా పై విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు.

కరోనా వైరస్ కు ఏకంగా చైనా వైరస్ గా నామకరణం చేశారు. అయితే ట్రంపు ఆరోపణలు తప్పు పడుతూ వస్తున్న చైనా అసలు రంగు ఇప్పుడు బయటపడింది. కరోనా వైరస్ వుహాన్ లోనే పుట్టింది అని చెప్పడానికి బలమైన ఆధారాలు వెలుగుచూశాయి.

పలు రికార్డులు బట్టబయలు

తాజాగా డబ్ల్యూహెచ్వో అంతర్గత సమావేశాలకు సంబంధించిన పలు రికార్డులు బయటపడ్డాయి. కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్లలో ఆ సంస్థ ప్రతినిధులు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు, అంతర్గత సమావేశాల్లో శాస్త్రవేత్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు పొంతన లేదని వీటి ద్వారా తెలుస్తోంది. దీంతో డబ్ల్యుహెచ్వో వ్యవహారశైలి మరోమారు చర్చనీయాంశంగా మారింది.

ప్రపంచ ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా ఇచ్చే సంస్థ డబ్ల్యూహెచ్ఓ. మహమ్మారి రోగాలు ప్రబలిన సమయాల్లో ఈ సంస్థ ఇచ్చే మార్గదర్శకాలే ప్రామాణికం. అయితే మహమ్మారి విషయంలో దీని వ్యవహారశైలిపై పలు విమర్శలకు తావిచ్చింది. పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చే సభ్యదేశాలను చూసీచూడనట్లుగా వ్యవహరించి.. కఠినంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది.

కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తుండడంతో అంతర్గత సమావేశాలకు సంబంధించిన రికార్డులు, పత్రాలు అసోసియేట్ ప్రెస్ కు చిక్కాయి. జనవరి నుంచి ఏప్రిల్ మధ్య జరిగిన వివిధ సమావేశాలకు సంబంధించిన రికార్డులు ఇందులో ఉన్నాయి. అంతేకాదు వైరస్ పై అధ్యయనం చేయడం ఆ ప్రయోగశాల దురదృష్టం అంటూ డబ్ల్యూహెచ్వో కు చెందిన అత్యున్నత నిపుణులు, శాస్త్రవేత్తలు అంతర్గత సమావేశాల్లో వ్యాఖానించినట్లుగా ఆ రికార్డుల్లో ఉంది.

దీంతో కరోనాకు మూల కేంద్రమైన చైనాలోని ఉహాన్ ల్యాబ్ గురించే వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు. తాజాగా లీకైన రికార్డులు, పత్రాలను పరిశీలిస్తే శాస్త్రవేత్తల అనుమానాలే నిజమని తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా విషయంలో వాస్తవాలను దాచి పెడుతోందని శాస్త్రవేత్తల్లో, ప్రజల్లో వెలువడిన అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో చైనా ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయిందని.. ఈ విషయం తెలిసినా డబ్ల్యుహెచ్వో ప్రపంచానికి చెప్పడం లేదని తెలుస్తోంది.

మొదటినుంచి తప్పుపడుతున్న ట్రంప్

మరోవైపు సరైన సమయంలో డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించి ఉంటే ప్రపంచ దేశాల్లో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యేవి కాదని పలు దేశాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కరోనా వైరస్ సహజ సిద్ధంగా పుట్టింది కాదని, ఉహాన్ ల్యాబ్ లో జరిగిన తప్పిదానికి ఇప్పుడు ప్రపంచం మూల్యం చెల్లిస్తోందన్న వాదనకు లీకైన రికార్డింగ్ మరింత బలం చేకూరుస్తున్నాయి. అటు ఈ రికార్డింగ్ ల వల్ల పలు దేశాల విషయంలో డబ్ల్యుహెచ్వో పక్షపాతంతో వ్యవహరిస్తోందనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఈ రికార్డింగులు, పత్రాల ద్వారా భారీ మొత్తంలో నిధులు ఇచ్చిన దేశాలలో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదైనా ,ఆయా దేశాలు కరోనా కట్టడి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా w.h.o. చర్యలు తీసుకోలేదని.. ఫలితంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలుస్తోంది.

ఓవైపు చైనాకు డబ్ల్యుహెచ్వో అనుకూలంగా వ్యవహరిస్తోందని బాహాటంగానే విమర్శలు గుప్పించి, పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థకు విధులు నిలిపివేశారు. దీంతో ఆ సంస్థ ఆర్థికంగా నష్టపోయి తీవ్ర ఒత్తిడికి గురి అయింది.

Biden newsmart9

అయితే ఈ చర్యలను కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు బైడెన్ విమర్శించారు. తాము ఎన్నికల్లో విజయం సాధిస్తే డబ్ల్యుహెచ్వో కు నిధులు విడుదల చేస్తామని, కోతలను ఎత్తివేస్తామని బైడెన్ హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం బైడెన్ అధ్యక్షుడు కాబోతున్న సందర్భంలో ఆరోగ్య సంస్థ అమెరికా వైపు ఆశగా చూస్తోంది. కానీ రికార్డింగ్ ల వ్యవహారం డబ్ల్యూహెచ్వో కు ఇబ్బందిగా మారింది. ఇలాంటి తరుణంలో బైడెన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఆసక్తికరంగా మారింది.

Leave a Comment