మా బాబు గారికి ఏమైంది ..!!

చంద్రబాబు మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని పదేపదే చెబుతుంటారు. ఆ అనుభవం అనే పదం అడ్డుపెట్టుకొని 2014లో అధికారంలోకి వచ్చారని కూడా చాలామంది అంటూవుంటారు. చంద్రబాబు అండ్ కో చెప్తున్న స్థాయిలో కాకపోయినా అనుభవమైతే పుష్కలంగా ఉంది కానీ, ఆ అనుభవం దేనికి ఆయన ఉపయోగిస్తున్నారు అనేది ఇక్కడ అసలైన మ్యాటర్.

ఎన్నో ఒడిదుడుకులు సైతం ఎదుర్కొనే నేర్పు,ఓర్పు ఆయనకు ఉందని అందరు చెబుతుంటారు. మరి అలాంటి చంద్రబాబు, వైయస్ జగన్ను ఎదుర్కోలేక ఇబ్బందులు పడుతున్నారు చాలా వరకు. సొంతంగా అస్సలు ఆయన ఆలోచించలేక పోతున్నారట.

నిజంగా చంద్రబాబు సొంత నిర్ణయాలు పక్కన పెట్టి చాలా రోజులైంది. ఎందుకంటే బాబు గారు సొంతంగా ఆలోచనాలు మానేసి ఇప్పుడు అంతా కాపీ పేస్ట్ మాదిరి ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు వైఖరి చూస్తున్న వాళ్లంతా కూడా ఒకటి ఆలోచిస్తున్నారు, చంద్రబాబు సొంతంగా ఆలోచించడం ఎందుకు మానేసారు అనే ఇప్పుడు అందరు అభిమానుల ప్రశ్న .

రాజకీయ చాణిక్యుడు అని చెప్పుకునే చంద్రబాబు ఇలా ఎందుకు మారిపోయారు.? ఈ ప్రశ్న ఉత్పన్నం కావడానికి గల కారణాలు ఏమిటి.? బీజేపీ ఎత్తుకున్న పంథానే చంద్రబాబు ఎత్తుకోవడం దేనికి సంకేతం.?.. అవును దేవాలయాల విగ్రహాల ధ్వంసంపై బీజేపీ పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలుసు. వారికంటే తప్పదు మరి. ఆంధ్రప్రదేశ్లో వారి స్థాయికి ప్రస్తుతం ఆ సమస్యలే దిక్కు కదా. వాటిపైన జెండాలు పాతేద్దామని వాళ్ళు అనుకుంటూ వస్తున్నారు. అందులో అర్థం ఉండి ఉండొచ్చు. మరి చంద్రబాబుకి ఏమైంది.

చంద్రబాబు కూడా బీజేపీ నేతల్లో కేవలం ఆ విషయాల పైన జగన్ ఏదో ఇరుకున పెట్టేస్తున్నామని సంబరపడి పోతున్నారు. కానీ బాబు గారికి తెలియని విషయం ఏమంటే వెనకాల అందరూ నవ్వుకుంటున్నారు. బాబు చెయ్యిపట్టుకుని నడిచిన మంత్రులు, నేతలు పార్టీని వీడి గుడ్బై చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. ఒక మతం ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని తహతహలాడిపోతున్నాడు చంద్రబాబు గారు.

ఆ విషయం మర్చిపోయారా

కానీ ఈ క్రమంలో తాను క్రిస్టియన్, ముస్లిం మరియు దళితులకు మరింత దూరమవుతున్నారనే వార్తలు చంద్రబాబు అసలు గ్రహించలేకపోతున్నారని సొంత టిడిపి తమ్ముళ్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత సీనియర్ పొలిటిషన్ అని చెప్పుకునే చంద్రబాబు ఈ విషయంలో కాస్త పునరాలోచించుకుంటారా లేక ఏదోలా బిజెపికి దగ్గర అయ్యేలా ప్రవర్తిస్తారా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.

పోనీ జనసేన తో పాటు టీడీపీ కూడా బిజెపికి మిత్రపక్షంగా ఉంటూ కాలం గడిపేద్దామని అనుకుంటుందా అంటే అదీలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు చంద్రబాబు పై అంతెత్తున లేచి ఆయనపై కోపం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటప్పుడు కూడా చంద్రబాబు కేవలం ఇలా ఎందుకు బిజెపి వారి లాగ ఆలోచిస్తున్నారు. చంద్రబాబు ఆలోచన శక్తి తగ్గిపోయిందా.. వయసు పై పడటమే దీనికి కారణమా.. పార్టీని కల్పించలేని స్థాయిలోకి చంద్రబాబు ఎందుకు వెళ్ళాడు.

ఇక రానున్న రోజుల్లో బాబుకే సాధ్యం కానిది లోకేష్ కు అవుతుందా.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ముందుకు వెళ్తుంది. ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఎంతో గొప్ప స్థానానికి వెళ్లాలని ఆయన అనుకున్నారు. కానీ అలా అనుకున్న వ్యక్తి కి వెన్నుపోటు పొడిచి, పార్టీని నిలబెట్టిన నాయకుడినే బజారుకీడ్చి సీఎం కూర్చుని దక్కించుకున్న వ్యక్తి నారా చంద్రబాబు గారు. అందుకే బాబు గారికి దేవుడు కరెక్ట్ దెబ్బ కొట్టాడని కూడా చాలామంది అంటున్నారు.

Leave a Comment