పరిపాలనా రాజధానిగా విశాఖే ఫైనల్ ..

Panchakarla Ramesh babu

తెలుగుదేశం పార్టీ ఎలమంచిలి మాజీ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఈ రోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఆయనకు స్వాగతం పలుకుతూ తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు గా పని చేసి అపారమైన అనుభవం సంపాదించి ఈ రోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పార్టీకి శుభసూచికం అన్నారు.

ఆయన యొక్క సేవలు పార్టీ తప్పకుండా ఉపయోగించుకుంటుందని, ఆయనకు సముచిత మైనటువంటి స్థానం మా పార్టీ అధ్యక్షుడు వైస్ జగన్ కల్పిస్తారు అని, ఇది నిజంగా సంతోషకరమైన విషయం అని అన్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేకి మరియు ఒక కులతత్వ వాది, దాంట్లో సందేహం లేదు అని అన్నారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అదే నెరవేరుతుందని రాజధానిపై స్పందించారు

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నానికి తరలించాలి అన్నటువంటిది పూర్తిగా ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి నిర్ణయం మాత్రమేనని అన్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది కాబట్టి ఎవరూ కూడా ఆపలేరు అన్నారు. కోర్టులపై తమకు గౌరవము, విశ్వాసం ఉంది అంటూనే ఏ రాజ్యాంగ వ్యవస్థ గాని రాజ్యాంగానికి అతీతంగా పోదని, తమకు న్యాయం జరుగుతుందని విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలిపోతోంది అన్న దాంట్లో ఎటువంటి సందేహమూ లేదని అయన విశ్వాసం వ్యక్తం చేసారు. ఈ ఒక కుల పిచ్చి ఎవరికైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే అన్నారు. ( ఆన్‌లైన్‌.. విద్యకు ఒక లైఫ్‌ లైన్‌.. )

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గత పదిహేను నెలలుగా చేస్తున్నటువంటి పరిపాలన ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంచుమించుగా 150 బీసీ వర్గాలకు గానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సెల్ కి కానీ న్యాయం చేసి ప్రయోజనం చేకూర్చేటువంటి ప్రభుత్వం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అన్నారు. 14 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి చంద్రబాబునాయుడు హయాంలో బడుగు బలహీన వర్గాలుకు ఏమాత్రం ప్రయోజనం పొందాయి ఈ విషయాన్ని మీరు ఒక్కసారి పరిశీలించుకోండి అని మీడియాకు సూచనా చేసారు.

ప్రతి వర్గానికీ కూడా ప్రతి కులానికి న్యాయం చేయగలిగింది ఒక్క జగన్మోహన్రెడ్డి గారు మాత్రమే అన్నారు. కాబట్టి కులాలకి, మతాలకి అతీతంగా పని చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నారు. రఘురామ కృష్ణం రాజు గురించి ప్రస్తావిస్తూ ఆయన పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు అందువల్లనే ఆయనాపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్ గారికి విజ్ఞప్తి చేశాం అన్నారు. ఆయనను స్టాండింగ్ కమిటీ కమిటీ చైర్మన్ నుంచి కూడా తొలగించమని పార్లమెంట్ కు విజ్ఞప్తి చేశాం, అది కూడా పరిశీలనలో ఉన్నాయి తగిన చర్యలు తీసుకుంటారని విశ్వాసం ఉంది అన్నారు.

Leave a Comment