Vivo Backstep | ‘వివో’ వెనకడుగు…

vivo 2

Vivo Backstep | ‘ఐపీఎల్‌–2020 స్పాన్సర్లలో ఎలాంటి మార్పు లేదు. ఈసారి కూడా ప్రధాన స్పాన్సర్‌గా ‘వివో’ కొనసాగుతుంది’… ఆదివారం జరిగిన సమావేశం తర్వాత ఐపీఎల్‌ గవరి్నంగ్‌ కౌన్సిల్‌ చేసిన అధికారిక ప్రకటన ఇది. అయితే రెండు రోజుల్లోపే అంతా మారిపోయింది. ఈ ఏడాది యూఏఈలో జరిగే లీగ్‌ స్పాన్సర్‌íÙప్‌ హక్కులు వదిలేసుకోవాలని చైనా మొబైల్‌ సంస్థ ‘వివో’ భావిస్తోంది. ఇంకా అధికారికంగా బీసీసీఐ దీనిని ఖరారు చేయకపోయినా… ‘వివో’ ఇప్పటికే ( Vivo Backstep ) నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

భారీ మొత్తానికి…

2008లో ఐపీఎల్‌ మొదలైన తర్వాత ముందుగా డీఎల్‌ఎఫ్, ఆ తర్వాత పెప్సీ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరించాయి. అయితే స్పాట్‌ ఫిక్సింగ్‌ అనంతరం వచ్చి న వివాదాలతో పెప్సీ అర్ధాంతరంగా తమ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకోగా మధ్యలో రెండేళ్ల కాలానికి ‘వివో’ స్పాన్సర్‌షిప్‌ కోసం ముందుకు వచ్చింది. ఆ తర్వాత 2017లో బోర్డుతో వివో ఐదేళ్ల కాలానికి భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2018–2022 మధ్య ఐదేళ్ల ఐపీఎల్‌కు రూ. 2199 కోట్లు (ఏడాదికి రూ. 440 కోట్ల చొప్పున) చెల్లించేందుకు సిద్ధమైంది. ఇందులో ప్రస్తుతం రెండేళ్లు మాత్రమే పూర్తయ్యాయి.

తప్పనిసరి పరిస్థితుల్లోనే…

గల్వాన్‌ ఘటన తర్వాత చైనా కంపెనీలతో ఒప్పందాలను పునఃస్సమీక్షిస్తామని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఐపీఎల్‌ సమావేశంలో మాత్రం అలాంటిదేమీ కనిపించలేదు. ‘కాంట్రాక్ట్‌ ఉల్లంఘన సమస్యలు’ తదితర అంశాలను కారణాలుగా చూపిస్తూ ‘వివో’ తదితర కంపెనీలను కొనసాగించేందుకే సిద్ధమైనట్లు ప్రకటించింది. ఒప్పందంలో ఇతర షరతులు, నిబంధనలపై పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోయినా… ఈసారి లీగ్‌తో జత కట్టడంకంటే దూరంగా ఉంటేనే మేలని ‘వివో’ భావించినట్లుంది. తాము చెల్లిస్తున్న భారీ మొత్తానికి తగినంత ప్రచారాన్ని, లాభాన్ని ఏ కంపెనీ అయినా కోరుకోవడం సహజం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ‘వివో’ ఆశించింది జరగకపోవచ్చు. కరోనా ఒక కారణం కాగా, చైనా కంపెనీలపై భారత్‌లో వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో ‘వివో’ ఆదాయంపై సహజంగానే ప్రభావం పడి ఉండవచ్చు.

అన్నింటికి మంచి మరో ప్రధాన కారణం నిబంధనల ప్రకారం ఐపీఎల్‌ ఆటగాళ్లు, జట్లు కచి్చతంగా ‘వివో’ ఉత్పత్తులకు ప్రచారం చేసి పెట్టాలి. ఈ సమయంలో ఏ కోహ్లితోనో, ధోనితోనో ‘వివో’ ఫోన్‌ కొనమని చెప్పించడం అంత సులువు కాదు! దీనివల్ల ప్రచారం కంటే ప్రతికూలం ప్రభావమే ఎక్కువగా పడుతుంది. వీటన్నింటికంటే లీగ్‌కు దూరంగా ఉండ టమే మేలని కంపెనీ అనుకున్నట్లుంది. అయితే అది ఈ ఒక్క ఏడాదికేనా లేక పూర్తిగా లీగ్‌ నుంచి తప్పుకున్నట్లా అనేదానిపై స్పష్టత లేదు. ఈ ఒక్క ఏడాది మాత్రమే ‘వివో’ వైదొలగితే… ఒప్పందాన్ని 2023 వరకు పొడిగించే అవకాశం ఉంది.

Leave a Comment