గాలి తీసేసిన బీజేపీ.. అడ్డంగా బుక్కైన నాని..

స్థిరమైన అభిప్రాయాలు లేకపోతే రాజకీయాల్లో బ్రతుకు బంతాట అయిపోద్ది. ఎవరికి దొరికితే వారు తంతూనే ఉంటారు. అందుకే మంచైనా చెడైనా ఒక స్థిరమైన అభిప్రాయం నమ్ముకునే ముందుకు పోతేనే రాజకీయాల్లో క్రెడిబిలిటీ ఉంటుంది. ఈ విషయం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన పార్టీ తెలుగుదేశం. వారికి స్థిరమైన అభిప్రాయాలు లేకపోవడంతో బిజెపి నేతలు ఒక ఆట ఆడుకుంటున్నారు.

అవును బిజెపి, టిడిపి కలయికలో రాష్ట్రం మామూలుగా ఉండదు. అవి రెండూ కలిస్తే ఏపీ ఎక్కడికో పోతుంది. టిడిపి, బిజెపిల కలయిక చారిత్రక అవసరం. మోడీని మించిన మగాడు లేడు అని చెప్పిన చంద్రబాబు అండ్ కో.. అంతలోనే మళ్ళీ బిజెపి రాష్ట్రానికి ద్రోహం చేసింది అని, రక్తం మరిగి వారితో విభేదిస్తున్నాము అని, మోదీని సరైన వ్యక్తి కాదు దుర్మార్గుడు అని, అమిత్ షా దుష్టుడు అన్న రేంజ్ లో ప్రకటనలు చేస్తూ ఉంటారు టిడిపి నేతలు.

ప్రస్తుతం ఈ పాయింట్ మీదే అడ్డంగా దొరికిపోయారు టిడిపి నేతలు. తాజాగా బెజవాడ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఓపెనింగ్ క్రెడిట్ ని కొట్టే పనిలో ఉన్న టిడిపి నేతలు, ఆ క్రమంలో బిజెపి నేతల భజన చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగా మైక్ అందుకున్న కేసినేని నాని అభివృద్ధి విషయంలో 2014-19 మధ్య కాలం ఏపీకి స్వర్ణయుగమని, రాష్ట్రం ముఖ చిత్రం మారిపోయింది అని, చంద్రబాబుతో పాటు నాటి కేంద్ర మంత్రులకు దక్కుతుందని, బిజెపి చాలా సపోర్ట్ గా నిలిచింది అని చెప్పుకొస్తున్నారు.

సరిగ్గా ఇదే విషయం పై ట్వీట్ అందుకున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. ” ఏమండోయ్ నాని గారు.. మీ చంద్రబాబు గతంలో బిజెపి గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఏమీ చేయలేదు.. అందుకే నేను నా రక్తం మరిగి పోయి నాడు బీజేపీని, కేంద్రాన్ని విభేదించి బయటకు వచ్చానని.. రోజుకు పది కోట్ల ప్రజల సొమ్ముతో ధర్మపోరాటం అని ఢిల్లీలో దీక్ష చేశాడు. నేడు మీరేమో గత ఐదేళ్లు స్వర్ణయుగం.. కేంద్ర మంత్రులు అందరూ రాష్ట్రానికి అండగా నిలిచారని చెప్పారు. ఒకసారి నా స్వార్థ రాజకీయాల కోసం బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తానని చంద్రబాబు గారి తో ప్రజల ముందు క్షమాపణ చెప్పించండి.. అయినా గానీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది టిడిపి వైఖరి” అని స్పందించారు. దీంతో బీజేపీ నేతలు టీడీపీ గాలి దారుణంగా తీసేసినట్లయిందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.

Leave a Comment