వినాయక చవితి… కనిపించని పండుగ సందడి..

Ganesh

వినాయక చవితి పండుగ నేపధ్యంలో ఈసారి వినాయక విగ్రహాల అమ్మకాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. గత సంవత్సరం ఇప్పటికే భారీ ఎత్తున విగ్రహాల తయారీలు, అమ్మకాలు కొనసాగేవి.

ఇప్పుడు కరోనా ప్రభావంతో మార్కెట్‌ మొత్తం తలక్రిందులు అయ్యింది. అన్ని రకాల పూల అమ్మకాలు నిలిచిపోయాయి. కొన్ని షాపుల్లో మాత్రమే విగ్రహాల అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టవద్దని నిబంధనలు పెట్టడంతో పాటు కరోన ప్రభావంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. ఈసారి రంగుల వినాయకుల కంటే మట్టి వినాయకులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ( కరెన్సీ టు డిజిటల్ .. కారణం కరోనానేనా..! )

వినాయక విగ్రహాలను ఇంట్లోనే ప్రతిష్ఠించుకోవాలని, విగ్రహాల ఎత్తు మూడు ఫీట్లకు మించరాదన్నారు. మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని, ప్రభుత్వ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని అధికారులు సూచించారు.

Leave a Comment