తప్పుచేయకపోతే భయమేల అశోకా? మాన్సాస్ ట్రస్ట్ భూముల పై విజయసాయిరెడ్డి ట్వీట్

ఏపీలో మాన్సాస్ ట్రస్ట్ భూముల వ్యవహారంపై పెద్ద దుమారమే చెలరేగింది. భూముల వ్యవహారం సంభందించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. ఇందుకు దేవాదాయ శాఖ కమీషనర్ ను నోడల్ ఆఫీసర్ గా నియమించింది. మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ వ్యవహారం పై తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ట్వీట్ చేసాడు.

మాన్సాస్ ట్రస్ట్ భూముల పై విచారణ

“మాన్సాస్ , సింహాచలం దేవస్థానం భూఅక్రమణలు నిజమేనని ప్రాధమిక విచారణలోనే తేలిపోయింది. విజిలెన్స్ దర్యాప్తులో ‘అశోక’ గుట్టు బయట పడింది. ఆడిట్ వద్దంటూ కోర్టుకెళ్లిన అతనికి మొట్టికాయలు పడ్డాయి. తన అక్రమాలపై విచారనే వద్దంటాడా? ధైర్యంగా ఎదుర్కొంటాడా? తప్పు చేయకపోతే భయమేల అశోకా? అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించాడు.

అదేవిధంగా కొనసాగింపుగా టీడీపీ పార్టీపై కూడా మరో ట్వీట్ చేసాడు.
“ఏమీలేని విస్తరి ఎగిరెగిరి పడినట్టు గా వుంది పచ్చ పార్టీ పరిస్థితి. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా బ్రష్టుపట్టించింది కాక.. ఎల్లో మీడియా,బాబూ,బానిస పార్టీలు,యూరోల్లో ఫీజు తీసుకునే కోవర్టులు రెచ్చిపోతున్నారు. వరుస ఎన్నికల్లో ప్రజలు తన్ని తరిమేసి రోజుకో రభస సృష్టిస్తున్నారు” అంటూ టీడీపీ పార్టీకి అండ్ దానికి వంట పడుతున్న ఎల్లో బ్యాచ్ కి తన పంచు డైలాగులతో అదరగొట్టారు.

‘ఏసీ’ ధర్నా శిబిరంపై

అలాగే అమరావతి శిభిరంలో జరుగుతున్న ధర్నాలపై మరో సెటైర్ వేశారు.
“అమరావతికి ఆ ఎత్తున మద్ధతు ఉంటే ‘ఏసీ’ ధర్నా శిబిరంలో కూర్చున్న వారి బంధుమిత్రులున్న గుంటూరు, విజయవాడ కార్పోరేషన్లలో వన్‌సైడ్‌గా గెలిచి ఉండేవారు. రియల్ ఎస్టేట్ గోల తప్ప రాజధానికి ఏం సంబంధమని అక్కడి పౌరులు చెంప పగలగొట్టే తీర్పు చెప్పారు. రోజుల లెక్కకు తప్ప ధర్నా దేనికి” అంటూ మరో ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.

1 thought on “తప్పుచేయకపోతే భయమేల అశోకా? మాన్సాస్ ట్రస్ట్ భూముల పై విజయసాయిరెడ్డి ట్వీట్”

Leave a Comment