Vijaya Sai Reddy fires on BJP leaders : ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పురందేశ్వరీ భాగంగా ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఇందులో వైసిపి (YCP ) పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిడిపి (TDP ) విషయంలో మాత్రం అంత ఘాటుగా ఆమె స్పందించలేదు రాజధాని విషయంలో బీజేపీకి రెండు నాలుకల ధోరణి లేదని అమరావతిలోనే రాజధాని ఉండాలి అన్నది బిజెపి నిర్ణయమని పురందేశ్వరి వివరించారు.
NDA నుంచి టీడీపీ, శివసేన మరియు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలు వాటంతట అవే బయటకు వెళ్లిపోయాయి అని ఆమె అన్నారు. తాము మిత్రపక్షాలతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నామని వారికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామని చెప్పుకొచ్చారు. అయినా కొన్ని పార్టీలు NDA నుంచి వెళ్లిపోయాయి అని ఆమె వివరించారు. అమరావతి లోనే రాజధాని ఉండాలని, అక్కడ భూములు ఇచ్చిన చోట అభివృద్ధి జరగాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.
వైసీపీ పాలన పై ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని హైకోర్టు నుంచి ప్రభుత్వం పదేపదే చివాట్లు ఎదుర్కొంటోందని విమర్శించారు. దాదాపు 70 వ్యాజ్యాల్లో ఎదురుదెబ్బలు తగిలాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అందులో ఎలాంటి అనుమానం లేదని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు.
పురంధేశ్వరి వ్యాఖ్యలపై వైసిపి నుంచి గట్టి ప్రతి స్పందనే వస్తోంది. అన్నీ అమరావతిలోనే ఉండాలని పురందేశ్వరి చెబుతున్నారని, మరి అలాంటప్పుడు కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని, సచివాలయానికి సంభందించి కొన్ని శాఖల భవనాలను కూడా రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి, ముఖ్యమంత్రి నివాసం కూడా రాయలసీమ లోనే ఉండాలి అంటూ 2018 ఫిబ్రవరిలో బిజెపి ఎలా రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చింది అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇది బిజెపి రెండు నాలుకల ధోరణి కాదా అని నిలదీస్తున్నారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( Vijaya Sai Reddy ) కూడా పురంధేశ్వరి వ్యాఖ్యలపై మరింత తీవ్రంగా స్పందించారు. పురంధేశ్వరి ఈరోజు ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందులో రాజధాని ప్రభుత్వ పనితీరు అంశంపై ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆమె జాతీయ నాయకురాలా లేక జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైనదని ట్విట్టర్ లో విమర్శించారు. ప్రస్తుత పురంధేశ్వరి బిజెపి లో ఉండగా ఆమె భర్త కుమారుడు మాత్రం వైసీపీకి కొనసాగుతున్నారు. ఎన్నికల ముందు వైసీపీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కు జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. కానీ ఎన్నికల్లో దగ్గుబాటి మాత్రం గెలవలేకపోయారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …