అన్ లాక్ 5.0 .. ఎంతవరకు అనుకూలిస్తాయి..

కేంద్ర హోంశాఖ 5.0 అన్ లాక్ మార్గదర్శకాలను జారీ చేసింది. ఆగస్టులో ప్రకటించిన గైడ్లైన్స్ పరిమితి నేటితో ముగియడంతో కేంద్ర హోంశాఖ మళ్ళీ కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఇవి అక్టోబర్ 31 వరకు అమలులో ఉంటాయి. స్కూళ్ళు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ ఫూల్స్ రీ ఓపెన్ కి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 15 తర్వాత దశలవారీగా వాటిని తెరవచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు.

స్కూళ్ళు, విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చించి పరిస్థితిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆన్ లైన్ మరియు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కొనసాగించవచ్చు.. ఆన్లైన్ క్లాసులు విధానాన్ని ప్రోత్సహించాలి.. స్కూళ్ళు ఓపెన్ చేసిన తర్వాత కొందరు ఆన్లైన్ క్లాసులు వినడానికి ఇష్టపడితే వారికి ఆ అవకాశం కల్పించాలి. విద్యార్థులు తమ తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకంగా తీసుకున్న తర్వాత మాత్రమే ప్రత్యక్షంగా క్లాసులకు హాజరు కావాలి. అటెండెన్స్ అనేది తప్పనిసరి కాదు. తమ రాష్ట్రంలో పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు SOP తయారు చేయాలి.

అన్ని విద్యాసంస్థలు సదరు నిబంధనలకు ఖచ్చితంగా పాటించాలి. స్కూళ్ళు, కాలేజీలు, విద్యాసంస్థల రీ ఓపెనింగ్ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఓ కొత్త సమస్య ఎదురు కానుంది. కొందరు విద్యార్థులు ఆన్లైన్లో క్లాసులు ఇష్టపడతారు.. ఆన్లైన్ క్లాసుల వలన సమస్యలు ఎదురయ్యే మరికొందరు విద్యార్థులు నేరుగా క్లాస్ రూమ్ లో పాటలు వినేందుకు మొగ్గుచూపుతారు.

కేంద్రం నిబంధనల ప్రకారం చూసుకుంటే ఆన్లైన్ క్లాసులు వినే వారికి అవకాశం కల్పించాలి. క్లాస్ రూమ్ కి వచ్చిన వారికి కూడా పాఠాలు చెప్పాలి. దీనివలన విద్యాసంస్థలు మానేజ్మెంట్ లో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇటు ఎదురుగా ఉన్న వారిని, అటు ఆన్లైన్ లో ఉన్నవారిని మేనేజ్ చేయటం టీచర్లకు కూడా ఇబ్బంది కలిగించవచ్చు. దీని వల్ల అందరూ ఆన్లైన్ క్లాసులు వినాలనో, లేకపోతే అందరూ క్లాస్ రూమ్ కి రావాలనో కండిషన్ విధించే అవకాశాలు కూడా లేకపోలేదు.

Schoolsreopen

అయితే 10 సంవత్సరాలలోపు పిల్లలను తమ ఇళ్ల నుంచి బయటకు రాక పోవడమే మంచిదని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మరి పది సంవత్సరాల్లోపు విద్యార్థుల భవిష్యత్తు ఏమిటనేది కూడా ప్రశ్నార్థకంగా మారానుంది. వారిని కేవలం ఆన్ లైన్ కే పరిమితం చేస్తారా.. ఒకవేళ ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తే ఆ వయసు వారికి ఆన్లైన్ క్లాసులు ఏమి అర్ధమవుతాయి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

వీరి పరిస్థితి ఏంటి

ఇక నర్సరీ నుండి ఐదవ తరగతి వరకు పదేళ్లలోపు చదివే విద్యార్థులు ఇప్పుడు డోలాయమానంలో పడ్డారు. క్లాసులు విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, విద్యాసంస్థలు తల్లిదండ్రులలో కూడా ఆందోళన నెలకొంది. కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ అక్టోబర్ 31 వరకు కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్లను ఆయా జిల్లాల అధికారులు ప్రకటిస్తారు. ఆకంటైన్మెంట్ జోన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్సైట్లో ప్రకటించాలి. ఇక కేంద్రంతో సంప్రదించకుండా కంటైన్మెంట్ జోన్ల బయట ఎలాంటి లాక్ డౌన్ ప్రకటించకూడదు.

ఒక రాష్ట్రంలో ఒక చోటి నుండి మరో చోటికి, గూడ్స్ మరియు వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు కూడా నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు. రాష్ట్రంలో ఎలాంటి షరతులు విధించకూడదు. పర్మిట్లు, కొత్త అనుమతులు లాంటివి ఏవీ విధించకూడదు. రైలు, విమానాల్లో ప్రయాణించే వారు.. వందే భారత్ మిషన్ కింద ఇతర దేశాల నుంచి వచ్చేవారు, ట్రాన్స్పోర్ట్ మరియు ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ లో వచ్చే వారు భారత ప్రభుత్వం విధించే SOP ని ఫాలో అవ్వాల్సిందే.

మరోపక్క చూసుకుంటే క్రీడాకారులు ఇతర సౌకర్యార్థం స్విమ్మింగ్ పూల్ కూడా అక్టోబర్ 15 తెరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక అన్ లాక్ 5.0 లో భాగంగా సినిమా థియేటర్లు సైతం ఓపెన్ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్స్ తో పాటు మల్టీప్లెక్ కూడా ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. కరోనా వైరస్ దారుణంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పై కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.

సగం సీటింగ్ సాధ్యమయ్యే పనేనా

అయితే ఇప్పుడు థియేటర్స్ ఓపెనింగ్ విషయంలో మాత్రం చాలా మంది నుంచి విమర్శలు వస్తున్నాయి. కేంద్రం చెప్పిన దాని ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ, దాంతో పాటుగా థియేటర్ లోకి కేవలం సగం సీటింగ్ కెపాసిటీ మాత్రమే ఉండేలా చుసుకోండంటూ చెప్పడంపై భిన్నాభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. అసలే కరోనా భయంతో జనం చచ్చిపోతున్నారు. బయటకు వస్తే ఏమవుతుందో అని ఇప్పటికీ మన హీరోలు ఇళ్లే దాటడం లేదు.

Theatersopen

ఇలాంటి పరిస్థితుల్లో సినిమా షూటింగ్ కూడా సరిగా జరగడం లేదు కానీ అప్పుడే థియేటర్స్ ఓపెన్ చేయాలంటూ అనుమతి వచ్చింది. ఇక్కడే అసలు అనుమానాలు వస్తున్నాయి. థియేటర్స్ ఓపెన్ చేసినా కూడా జనాలు ముందులా వస్తారా.. థియేటర్స్ మళ్లీ నిండుతాయా.. సోషల్ డిస్టెన్స్ అనేది పాటిస్తారా.. ఇలా సవాలక్ష అనుమానాలు అందరి మనసుని కలచి వేస్తుంది. అన్నింటికంటే ముందు కేవలం సగం వికెట్లు మాత్రమే అమ్ముకోవాలి అనే కండిషన్ కు నిర్మాతలు ఓకే చెప్తారా.. అలా 50 శాతం టికెట్స్ అమ్మితే నిర్మాతలకు లాభం వస్తుందా.. ఇలా ఎన్నో అనుమానాలతో థియేటర్స్ తెరుచుకోవాల్సి వస్తుంది.

కరోనాతో సినిమాలకు రావడమే ఘఘనం అనుకుంటే, వచ్చిన కేవలం సగం సీటింగ్ కెపాసిటీ నింపుకోవాలని షరతు పెట్టడంతో నిర్మాతలు అయోమయంలో పడిపోయారు. ఈ రోజుల్లో ఒక్క సినిమాకు కోట్లకు కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. మూడు రోజుల కలెక్షన్స్ ఆధారంగా మారుతుంది. ఇలాంటి సందర్భంలో సగం టికెట్స్ అమ్ముకోవడం అనే కాన్సెప్టు వర్కౌట్ కాదంటూ నిర్మాతలకు టెన్షన్ మొదలయింది. ఇప్పుడు విడుదల చేయాలనుకున్న సినిమాలు కూడా ఒక రకంగా ప్రయోగమే అవుతుంది. ఎందుకంటే తొలి రోజునే పైరసీ వస్తున్నా ఈ రోజుల్లో , సగం టికెట్స్ అమ్ముకుని వచ్చిన డబ్బులతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు బయటపడటం అనేది దాదాపు అసాధ్యమైన విషయం అనే చెప్పాలి.

Leave a Comment