బ్యాంకు ఉద్యోగుల బదిలీ.. ఒత్తిడి మేరకే అన్న ఉద్యోగులు..

అమరావతిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కుమార్తెలకు సంబంధించిన లావాదేవీలు అంశంలో మరో పరిణామం చోటుచేసుకుంది. ఈ భూ లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు వివరాలను దర్యాప్తు సంస్థకు అందజేశారు అన్న ఉద్దేశంతో ఐదుగురు ఉద్యోగులపైన బదిలీ వేటు వేశారు. యూనియన్ బ్యాంకు కి సంబంధించిన ఐదుగురు ఉద్యోగుల పైన ఈ వేటు పడింది.

అయితే ఇది ఒక పనిష్మెంట్ తో కూడిన బదిలీలుగా ఉద్యోగులు అభివర్ణిస్తున్నారు అంటూ ఈ అంశం పైన ఒక ప్రముఖ పత్రిక పెద్ద కథనాన్ని రాసింది. అమరావతిలో కొందరు లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయి కాబట్టి అందుకు సంబంధించిన బ్యాంకు వివరాలు ఇవ్వాలి అంటూ ఏసీబీ అధికారికంగానే లేఖల రూపంలో యూనియన్ బ్యాంకును కోరింది.

దాంతో యూనియన్ బ్యాంకు ఉద్యోగులు తమకు సంబంధించిన లీగల్ టీం అడ్వైజ్ కూడా తీసుకున్నారు. దర్యాప్తు సంస్థ అధికారికంగా అడిగినప్పుడు నిందితులకు సంబంధించిన వివరాలను ఇవ్వచ్చు అని బ్యాంకు లీగల్ టీం చెప్పడంతో.. ఆ తర్వాత ఉద్యోగులు అందుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలు ఆంధ్రప్రదేశ్ ఏసీబీకి అందజేశారు.

ఒత్తిళ్లే కారణమా

దీంతో ఈ అంశం బయటకు రావడం.. పెద్ద సంచలనం సృష్టించడం కూడా జరిగింది. అయితే ఈ బ్యాంకు వివరాలు బయటకు రావడానికి కారణమైన ఉద్యోగులపైన ఆరాతీసిన కొందరు పెద్దలు, వారి పైన చర్యలు తీసుకోవాల్సిందిగా యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్టు తమకు సమాచారం ఉంది అంటూ ఆ పత్రిక వెల్లడించింది.

UnionBank newsmart9

ఈ వివరాలను దర్యాప్తు సంస్థకు ఇవ్వడం చట్టబద్ధమే అని బ్యాంకు లీగల్ టీం భావించినప్పటికీ కూడా.. పై నుంచి ఒత్తిళ్లు తగ్గలేదు. దాంతో విజయవాడ డివిజనల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగుల పైన బదిలీ వేటు వేశారు. వీరిలో ముగ్గురిని చెన్నైకి, మరో ఇద్దరిని ముంబైకి బదిలీ చేసినట్లు ఆ పత్రిక వివరించింది.

ముంబై కి బదిలీ అయిన ఒక ఉద్యోగి వచ్చే ఏడాదిలో రిటైర్మెంట్ కావాల్సి ఉంది. రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నప్పుడు బదిలీ చేయడం అన్నది ఉండదు. అయినా సరే ఈ విషయంలో బదిలీ చేశారంటే ఇది పూర్తిగా పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ గానే ఉద్యోగులు అభివర్ణిస్తున్నారు అని ఆ పత్రిక వెల్లడించింది.

ఒకసారి ఈ అమరావతికి సంబంధించిన అనుమానాస్పద లావాదేవీలు బయటకు తీయడం మొదలు పెడితే.. ఇది ఒక బ్యాంకుతో ఆగదు. మిగిలిన బ్యాంకులు కూడా ఇలాగే ఆ డేటాని ఇచ్చే అవకాశం ఉంటుంది.

కాబట్టి మిగిలిన బ్యాంకుల్ని భయపెట్టాలి అన్న ఉద్దేశంతోనే యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారుల పైన తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి ఈ ఐదుగురు ఉద్యోగుల పైన బదిలీ వేటు వేయించారు అని ఉద్యోగులు అనుమానిస్తున్నారు.. ఆరోపిస్తున్నారు అని కూడా ఆ పత్రిక వెల్లడించింది.

కోవిడ్ నేపథ్యంలో 2021 వరకు ఎలాంటి బదిలీలు ఉండవు అని నెల క్రితమే ఒక సర్కులర్ ను బ్యాంకు యాజమాన్యం విడుదల చేసింది. అయినప్పటికీ ఆ అయిదుగురిని ఇలాంటి కోవిడ్ పరిస్థితుల్లో ఏకంగా రాష్ట్రాలు దాటించి బదిలీ చేయడం నిజంగానే ఒక పనిష్మెంట్ తో కూడిన వ్యవహారం.

కేవలం అమరావతిలోని అనుమానాస్పద భూ లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఇవ్వడం వల్లే కొందరు పెద్దలు ఒత్తిడి తెచ్చి ఈ ఐదుగురు ఉద్యోగుల పైన చర్యలు తీసుకునేలా చేశారు అని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు అంటూ ఆ పత్రిక తన కధనం ద్వారా వెల్లడించింది.

Leave a Comment