షాకింగ్ కి గురిచేస్తున్న వేల సంఖ్యలో పక్షుల మృతి ..!!

వాతావరణంలో పరిస్థితులు అత్యంత వేగంగా మారుతున్నాయి. దీనికి తోడు కరోనా కూడా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. వీటి ప్రభావం మానవ జాతి మీదనే కాకుండా వలస పక్షులపై కూడా పడిందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ మధ్య మెక్సికోలో వలస పక్షులు కొన్ని వేల సంఖ్యలో మృతి చెందడం జరిగింది. మెక్సికోతో పాటు మరికొన్ని ప్రాంతాలైన టెక్సాస్, కొలరాడో మరియు అరిజోనాలలో పక్షులు కూడా అనుమానాస్పదంగా మృతి చెందాయి. దీనికి గల కారణం పరిశోధకులకు కూడా అంతుచిక్కక పోవడం ఆందోళనలకు గురిచేస్తుంది.

మృత్యువాత పడిన జాబితాలో బ్లూ బర్డ్, బ్లాక్ బర్డ్, ఫ్లై కాచర్స్ జాతి పక్షులు ఎక్కువగా వున్నాయి. వీటి మరణానికి అసలు కారం పూర్తిగా తెలియనప్పటికీ, మెక్సికోలో ఏర్పడిన కరువు, వాతావరణ పరిస్థితులు దానికి తోడు పశ్సిమంలో ఏర్పడిన కార్చిచ్చు కారణం అయి ఉండవచ్చని మరికొందరి పరిశీలకుల అభిప్రాయంగా తెలుస్తుంది. ( తస్మాత్ జాగ్రత్త..!! )

దీనిపై స్పందించిన ఎన్ఎస్ఎమ్యూ జీవ శాస్త్రవేత్త అయిన మార్తా డెస్మాండ్, ఇంత పెద్ద సంఖ్యలో పక్షులు మరణించడం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని, ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగే అవకాశం లేకపోలేదని అన్నారు.

మొదటగా పక్షులు ఎక్కువ మొత్తంగా ఇలా మరణించడాన్ని యూఎస్ ఆర్మీ దళాలు ఆగస్టులో గుర్తించాయి. యూఎస్ లోని పరికొన్ని ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ వన్య ప్రాణులు మరియు వలస పక్షుల మరణాలపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment