శ్రీవారి కీర్తిని నలుదిశలా…

టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీవారి కీర్తిని నలుదిశలా వ్యాప్తి చేసే విధంగా దేవాలయాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంటామని ఇటీవల టీటీడీ పాలకమండలి తెలిపింది.

బాంబే లో దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామని, వారణాసిలో దేవాలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వాన్ని స్థలం కేటాయింపు అనుమతులు కోరుతామని కూడా పేర్కొంది. జమ్ము కాశ్మీర్ లో కూడా ఆలయం నిర్మిస్తామని తెలిపింది. కరోనా ప్రభావం కారణంగా కొద్దిగా ఆలస్యం అవుతుందని చెప్పింది. స్థానికంగా విరాళాలు సేకరించి అక్కడ ఆలయాల నిర్మాణం చేపట్టాలని పాలక మండలి నిర్ణయం తీసుకున్నామని, ప్రధానంగా టిటిడి ఆదాయం పెంచేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని కూడా టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చెప్పారు.

ఫిక్స్డ్ డిపాజిట్లపై కార్పస్ ఫండ్స్ లో కొన్ని మార్పులు తీసుకొస్తున్నామని, బోర్డు ఆసుపత్రి ప్రాంగణములో చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. వైజాగ్ లో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తిచేస్తామని, కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని కూడా వై వి సుబ్బారెడ్డి గారు చెప్పారు.

ఇక వీటితో పాటు గో సంరక్షణ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టిటిడి నిర్ణయించుకుందని, ప్రతి ఆలయానికి ఒక గోవు ఇవ్వాలని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. గోవులను ఇచ్చే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. బ్యాంకుల్లో స్వామివారి విరాళాలు డిపాజిట్ విధానాలు పూర్తిగా మార్చబోతున్నట్టుగా నిర్ణయించినట్టు చెప్పారు.

ప్రతి ఆలయానికి ఒక గోవు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని నటుడు మురళీమోహన్ సైతం ప్రశంసించారు. టిడిపి వ్యక్తి ఇలా ప్రశంసించడం మరో షాక్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి. దేవుడి తో పాటు గోవుని కూడా హిందువులు పూజిస్తారు, అటువంటి ఆలయానికి గోవుని ఇవ్వాలని నిర్ణయించిన టీటీడీ పాలకమండలిని ఆయన కొనియాడారు.

ప్రస్తుతం దేవాలయాల్లో గోమాతలు కనిపించడం లేదని, టిటిడి తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పది అన్నారు. నిత్యం గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసి గోమాతను పూజిస్తే అనుకున్న కార్యక్రమాలు జరిగిపోతాయని హిందువుల నమ్మకాన్ని మురళీ మోహన్ తెలిపారు. ప్రతి ఆలయానికి గోవును ఇవ్వాలన్న గొప్ప నిర్ణయం తీసుకున్న చైర్మన్ వై వి సుబ్బారెడ్డిని, బోర్డు మెంబర్లను మరోమారు అభినందిస్తున్నానని మురళీమోహన్ చెప్పుకొచ్చారు.

వైయస్ జగన్ డిక్లరేషన్ అంశంపై టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హిందూ మతానికి వ్యతిరేకంగా ఆయన కార్యకలాపాలు చేస్తున్నారని, హిందువుల కీర్తిని తగ్గించే విధంగా ఆయన నడుచుకుంటున్నాడని విమర్శలు చేశారు.

అలా విమర్శలు చేసిన వారి పార్టీ నుంచి ఒక వ్యక్తి వచ్చి జగన్ గారిని, జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారంటే ఇక్కడ తప్పు ఎవరిదో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ప్రముఖ నటుడు టిడిపి నిర్ణయాన్ని కొనియాడడం పై టిడిపి నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ప్రభుత్వంపై విమర్శలు చేసేటప్పుడు ఏదైనా ఒక ఆలోచన విధానం ఉంటే మంచిది.

Leave a Comment