గుడ్ న్యూస్.. బార్లు ఓపెన్ కు ఓకే ..

బార్లు తిరిగి తెరుచుకునేందుకు తెలంగాణా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బార్లు మరియు క్లబ్బులు మరియు పర్యాటక ప్రాంత బార్లకు నియమాలతో కూడిన అనుమతినిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు పర్మిట్ రూంలకు మాత్రం అనుమతి లేదని తేల్చిచెప్పింది. బార్లు, క్లబ్బులలో మ్యూజికల్ ఈవెంట్స్ మరియు డాన్సులపై నిషేధం కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. covid-19 నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని బార్ యజమానులకు ఆదేశాలు జారీ చేసింది.

సోషల్ డిస్టెన్స్ మరియు సానిటైజేషన్ నియమాలు తప్పకుండ పాటించాలని సూచించింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం బార్లకు అనుమతి ఇవ్వడం జరిగింది.
మార్చిలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ తరువాత రాష్ట్రంలోని బార్లు, క్లబ్బులు మరియు మద్యం దుకాణాలు మూసివేయబడ్డాయి. అయితే, మే నెలలో మద్యం దుకాణాలను తిరిగి తెరవడానికి రాష్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం జరిగింది.

Leave a Comment