ప్రైవేటు ఆసుపత్రులపై కన్నెర్ర..

Beds hos

కరోనా సమయంలో కనికరం లేకుండా చేస్తున్నాయి ప్రైవేటు ఆసుపత్రులు. బాధితుల భయాన్ని ఆసరాగా చేసుకొని లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. రోగి మరణించినా ఆ విషయం కుటుంబ సభ్యులకు చెప్పకుండా వారినుంచి లక్షలు దండుకుంటున్నాయి.

దీనిపై ప్రభుత్వం ఎంత చెప్పినా అవి దారికి రావడం లేదు. చివరకు రెండు ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది.
ఆసుపత్రి నుంచి ఒరిజినల్‌ బిల్లులు ఇస్తే బాధితులు వాటిద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారని భావించి తెల్లకాగితాలపై బిల్లులు రాసివ్వడం మొదలు పెట్టారు తప్ప బిల్లులు మాత్రం తగ్గించడం లేదు.

కనుక అలాంటి ఆసుపత్రులన్నింటిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కరోనా చికిత్స ఫీజుల విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోని హాస్పిటల్స్‌పై బెడ్లు స్వాధీనం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అంతేగాక ఇటీవల వైద్యశాఖ వాట్సాప్‌ నంబరుకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని హాస్పిటల్స్‌ ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు.

దీంతో ఆయా ఆసుపత్రుల్లో కూడా 50 శాతం బెడ్లను వైద్యశాఖ తమ ఆధీనంలోకి తీసుకోనుందని ఆరోగ్యశాఖలోని ఓ ముఖ్య అధికారి తెలిపారు. సుమారు మూడు వందలకు పైగా ఆసుపత్రులు ఇప్పటివరకు వైద్యశాఖ ఇచ్చిన నోటీసుకు వివరణ ఇవ్వలేదని మరో అధికారి వెల్లడించారు. ( జ్వరమా .. అయినా భయపడకు )

ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ నిర్లక్షం స్పష్టంగా కనిపిస్తుందని హెల్త్‌ డైరెక్టర్‌ అధికారుల బృందం అభిప్రాయపడింది. ఇప్పటికే హై లెవల్‌ కమిటీ సైతం ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లింది.

సుదీర్ఘ పరిశీలన అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని సీఎం కూడా ఆదేశించినట్లు ఓ అధికారి చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. సదరు ఆసుపత్రులపై ఎమిడమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకునేందుకు యాక్షన్‌ ప్లాన్‌ రెడీ అయింది.

Leave a Comment