టీ పిసిసి చీఫ్ పదవి ఎవరిని వరిస్తుందన్న దానిపై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దీంతో ఈ పంచాయతీ ఇప్పుడు ఢిల్లీకి చేరుకుంది.
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరో పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడు ఎంపిక జరుగుతోంది.
ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెసు సీనియర్ల అభిప్రాయాలు తీసుకున్న కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ ఒక రిపోర్ట్ రెడీ చేశారు. దాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లిపోయారు.
ఇక ఢిల్లీ నుంచి ఓ ప్రకటన రావాల్సివున్న తరుణంలో పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న నేతలు అస్తినబాట పట్టారు. ఇందులో భాగంగా టిపిసిసి రేస్ లో ఉన్న ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు.
తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి వివరించారు. టీ పిసిసి చీఫ్ పదవి తనకే ఇవ్వాలని ఆయన సోనియాకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాను ఎంపీ అయినప్పటికీ పీసీసీ ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.
మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వారికే టీ పిసిసి చీఫ్ ఇవ్వాలని కోమటిరెడ్డి కోరుతున్నారు. మరోవైపు టీ పిసిసి రేసులో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా బుధవారం ఢిల్లీ వెళ్లారు. రాహుల్ గాంధీతో ఆయన సమావేశం కానున్నారు.
పైకి చెప్పకపోయినా పీసీసీ పదవి తనకే ఇవ్వాలని రేవంత్ రాహుల్ ని కోరే అవకాశముందని తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు ఢిల్లీలోనే ఉండడంతో టిపిసిసి రేస్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …