ఈ సంవత్సరపు మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం (Bloodmoon) రేపు రానున్నది. బ్లడ్ మూన్ గా పిలుచుకునే ఈ చంద్రగ్రహణం కోసం ఖగోళ శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. గ్రహణం సమయంలో చందమామ ఎరుపు, నారింజ రంగుల్లో కనిపించి కనువిందు చేయనుంది.
ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డంగా రావడం వలన సూర్యకిరణాలు చంద్రుడిపై పడవు. ఆ సమయంలోనే గ్రహణం ఏర్పడుతుంది. అయితే సూర్యకిరణాల్లోని ఎరుపు మరియు నారింజ రంగు కిరణాలు భూమి నుంచి ముందుకు దూసుకెళతాయి. అందువల్ల చందమామ కాస్త భిన్నంగా కనబడుతుంది.
Bloodmoon సంపూర్ణ చంద్రగ్రహణం
ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇలాంటి గ్రహణం 2019 జనవరి 21న ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ మే 26న అంటే రేపు బుధవారం రాబోతుంది. దీంతో ఎర్రటి వర్ణంతో ధగధగా మెరిసే బ్లడ్ మూన్ కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కాగా ఈ గ్రహణం భారత్ లో మధ్యాహ్నం 3:15 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల 22 నిమిషాలకు ముగిస్తుంది. సంపూర్ణ గ్రహణం 14 నిమిషాల 30 సెకన్ల పాటు ఉంటుంది.
ఇక ఈ చంద్రగ్రహణం ఈశాన్య ఆసియా, పసిఫిక్ సముద్రంలో, ఉత్తర దక్షిణ అమెరికా ప్రాంతాలు, ఆస్ట్రేలియా లో కనిపిస్తుంది. మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమబెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం కనువిందు చేయనుంది. భారత్లో పాక్షికంగా ఈ గ్రహణం కనిపిస్తున్నప్పటికీ, ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. అంతే కాకుండా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు 14 నిమిషాల పాటు సంపూర్ణంగా దర్శనం ఇవ్వనుంది.
ఏయే సమయాల్లో ఎలా ఉంటుందంటే
సంపూర్ణ చంద్రగ్రహణం మన దేశంలో ఏయే సమయాల్లో ఎలా ఉంటుందంటే, మే 26 బుధవారం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు చంద్రగ్రహణం మొదలవుతుంది. సాయంత్రం 4 గంటల 39 నిమిషాలకు సంపూర్ణం అవుతుంది. అప్పుడు చందమామ పూర్తిగా కనిపించదు. మళ్ళీ సాయంత్రం 4 గంటల 58 నిమిషాలకి చంద్రగ్రహణం వదిలేస్తే ప్రక్రియ మొదలవుతుంది. ఆ సమయంలో చందమామ గుండ్రని ఆకారం రింగులా కనిపిస్తుంది. సాయంత్రం 6 గంటల 23 నిమిషాలకి చంద్రగ్రహణం పూర్తిగా తొలగిపోయి సంపూర్ణ చంద్రుడు కనిపిస్తాడు.
చంద్రగ్రహణం అనగానే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశుల పై ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్న అనుమానం చాలామందిలో మొదలవుతుంది. అందులోనూ ఇది కరోనా కాలం. కాబట్టి ఈ గ్రహణం వల్ల ఏ రాసుల వారి కైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా అని కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అయితే ఈ గ్రహణ ప్రభావం 12 రాశులపై ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే ఇండియాలో ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపించదు కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటున్నారు జ్యోతిష్య పండితులు.
అయినా కూడా ఈ గ్రహణం సమయంలో బయటకి రాకుండా ఉండటం,శుభకార్యాలు ప్రారంభించకుండా ఉండటం, గర్భినీ స్త్రీలపై గ్రహణ నీడ పడకుండా చూడటం వంటి కొన్ని జాగ్రత్తలు పాటించాలని జోతిష్యులు సూచిస్తున్నారు. బ్లడ్ మూన్ రూపంలో కనువిందు చేయనున్న ఆ చంద్రుడ్ని చూడటానికి ప్రతి ఒక్క్కరు ఏంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …