కరోనాతో మృతి చెందిన తిరుపతి ఎంపీ..

కరోనాతో ఏపీలోని తిరుపతి పార్లమెంట్‌ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్‌ కొద్దిసేపటి క్రితం మరణించారు. దుర్గాప్రసాద్‌కు ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.అక్కడ ఆయన చికిత్స పొందుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో బుధవారం సాయంత్రం సుమారు 6.00 గంటల ప్రాంతంలో మృతి చెందారు.

దుర్గాప్రసాద్‌ 28 ఏళ్లకే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1994లో చంద్రబాబు హయాంలో కేబినేట్‌ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆయన 2019లో రాజకీయ పరిణామాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా వైసీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంతో దుర్గాప్రసాద్‌కు మంచి సంభందాలు కలిగివున్నాడు. అన్నివర్గాల నేతలతో ,కార్యకర్తలతో మంచి సత్సంబంధాలున్నాయి. అంతేకాకుండా ప్రజలతో కూడా ఆయన అతి సన్నిహితంగా మెలిగేవారన్న ప్రచారం కూడా ఉంది. ఎంపీగా విజయం సాధించిన తర్వాత కూడా దుర్గాప్రసాద్‌ తిరుపతి పార్లమెంట్‌ స్థానంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.

Leave a Comment