జగన్ దెబ్బకు కదిలిరానున్న సినిమా ఇండస్ట్రీ

జగన్ సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కుదేలవుతోంది. పెద్ద హీరోల సినిమాలు విడుదల సమయంలో టికెట్లు రేట్లు పెంచుకుంటూ పోవడం ఆనవాయితీగా మారింది. గత టీడీపీ ప్రభుత్వం సమయంలో ఇది మరీ ఎక్కువగా మారింది. పైగా పెద్ద హీరోల సినిమాలు విడుదల సమయంలో రోజుకు నాలుగు షోలు కాస్త 5 నుంచి 6 వరకు అనుమతి ఇచ్చింది టీడీపీ. దీంతో సినిమా చూడాలంటే సగటు ప్రేక్షకులకు భారంగా మారింది. అదే ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్లాలంటే జేబులు ఖాళీ అయ్యే పరిస్థితి. అందుకే చాలా మంది ప్రేక్షకులు సినిమాలను థియేటర్ కు వెళ్లి చూడటానికి ఇష్టపడట్లేదు.

ఓటిటితో కలెక్షన్స్ నిల్

ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్ రావడంతో అందరూ దానిని అనుసరిస్తున్నారు. దీంతో చాలా మంది తెలుగు సినిమా నిర్మాతలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రేక్షకుల దగ్గర నుండి డబ్బులు గుంజుతున్న సినిమా రంగంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకమీదట ఏపీలో ఏ సినిమా విడుదలైనా కూడా టికెట్ల రేట్లను పెంచడం వీలులేదని జీవో తీసుకువచ్చింది. పైగా రోజుకు నాలుగు షోలకు మించి వేయకూడదని ఆదేశాలు కూడా జారీ చేసింది. ( ఓటీటీ ప్లాట్ ఫామ్ )

జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం తో తెలుగు సినిమా రంగం షాక్కు గురైంది. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకు కూడా ప్రత్యేక షోలకు అనుమతులు అడిగినప్పుడు కూడా వారికి జగన్ సర్కారు అనుమతి ఇవ్వలేదు. దీంతో వకీల్ సాబ్ సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ నష్టాలు తప్పలేదు. ఏపీలో వకీల్ సాబ్ సినిమాను తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు బాగానే నష్టపోయారని తెలుస్తోంది.

జగన్ ను కలవడానికి సిద్దమైన సినిమా పెద్దలు

పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోవు రోజుల్లో ఏపీలో సినిమాను కొనడానికి ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ముందుకు రాని పరిస్థితి ఉంటుంది. దీంతో తెలుగు సినిమా ప్రముఖులు ఏపీ సీఎం జగన్ ను కలవడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అందులో అగ్ర హీరోల్లో ఒకరైన హిందూపురం టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఉన్నారు. ఇప్పటికే బాలకృష్ణ సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. ( జగన్ కు అమిత్ షా ఫోన్ )

అయితే జగన్ మాత్రం ఇంకా బాలకృష్ణకు అపాయింట్మెంట్ ఖరారు చేయలేదని వార్తలు వస్తున్నాయి. పార్టీలు వేరైనా ఇప్పటికి కూడా సినిమా ఇండస్ట్రీ కోసం జగన్ ను కలవడానికి రెడీగా ఉన్నానని ఆయన గతంలోనే చెప్పారు. బాలకృష్ణతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా జగన్ ను కలవడానికి రెడీగా వున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా నిర్మాతలు అందరూ కలిసి ఓ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జగన్ తో సన్నిహితంగా ఉండే చిరంజీవిని సైతం కలుపుకుని వెళ్ళాలి అని చూస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ మెచ్చిన ఫ్యామిలీలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. ఆయన గతంలో జగన్ కు తన మద్దతు కూడా తెలిపారు. ప్రస్తుతం ఆయన కుమారుడు మహేష్ బాబు టాప్ హీరోల్లో ఒకరు. మహేష్ బాబు సినిమాల్లో హీరోగానే కాకుండా.. నిర్మాతగా పలు సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. దీంతో ఆయన కూడా కొంతమంది సినిమా వారితో కలిసి జగన్ ను కలవడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

మొత్తానికి జగన్ సర్కార్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చినట్లుగా కనిపిస్తోంది. మరి వీరితో భేటీ అనంతరం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Leave a Comment