తెలంగాణలో కోవిడ్ టెస్టులు 6 లక్షలు దాటాయి. వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు జూలై 8వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో కరోనా టెస్టులు విస్తృతంగా జరుగుతున్నాయి.
ఆర్‌టిపిసిఆర్‌తో పాటు యాంటీజెన్ టెస్టులు కూడా వైద్యశాఖ వేగంగా నిర్వహిస్తుంది. ప్రతి రోజూ సుమారు 20వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తూ వైరస్ కంట్రోల్‌కి కృషి చేస్తున్నారు.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6,13,231 టెస్టులు చేసినట్లు హెల్త్ డైరెక్టర్ బులెటెన్‌లో స్పష్టం చేశారు. వీటి నిర్ధారణ ద్వారా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో నివారణ చర్యలు తీసుకుంటూ వైరస్ కట్టడికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే జిహెచ్‌ఎంసిలో కేసులు కాస్త తగ్గుముఖం పట్టగా, జిల్లాల్లోనూ అతి త్వరలోనే కేసులు అదుపులోకి వస్తాయని అధికారులు అంటున్నారు.
ఇదిలా ఉండగా ఆదివారం 22,495 టెస్టులు చేయగా, 1982 పాజిటివ్‌లు తేలాయి. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 463 ఉండగా, ఆదిలాబాద్‌లో 12, భద్రాద్రి 64, జగిత్యాల 42, జనగాం 78, భూపాలపల్లి 21, గద్వాల 93, కామారెడ్డి 62, కరీంనగర్ 96, ఖమ్మం 47, ఆసిఫాబాద్ 7, మహబూబ్‌నగర్ 43, మహబూబాబాద్ 17 మంచిర్యాల 31, మెదక్ 26, మేడ్చల్ మల్కాజ్‌గిరి 141, ములుగు 21, నాగర్‌కర్నూల్ 23, నల్గొండ 59, నారాయణపేట్ 3, నిజామాబాద్ 58, పెద్దపల్లి 71, సిరిసిల్లా 29, రంగారెడ్డి 139, సంగారెడ్డి 49, సిద్ధిపేట్ 55, సూర్యాపేట్ 20, వికారాబాద్ 10,వనపర్తి 28, వరంగల్ రూరల్40, వరంగల్ అర్బన్ లో 71, యాదాద్రిలో మరో 16 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.
అదే విధంగా వైరస్ దాడిలో మరో 12 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 79,495కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 55,999కి చేరింది.
ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 22,869మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 16,112మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 627కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16 కేంద్రాల్లో ఆర్‌టిసిపిఆర్, 320 సెంటర్లలో టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
దీంతో పాటు మరో 23 ప్రైవేట్ ల్యాబ్‌లలోనూ పరీక్షలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఎంఎల్‌సి గంగాధర్ గౌడ్‌కు కోవిడ్..
ఎంఎల్‌సి గంగాధర్ గౌడ్‌కు పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనతో పాటు భార్య, కుమారుడికి కూడా వైరస్ సోకింది. ఇప్పటి వరకు మంత్రులు, ఎంఎల్‌ఎలకు పాజిటివ్‌లు తేలగా, తాజాగా ఎంఎల్‌సి కూడా కోవిడ్ నిర్ధారణ కావడం ఆందోళనకరం.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్‌కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …