బయటకొచ్చిన తీన్మార్ మల్లన్న.. టార్గెట్ ఫిక్స్..!!

తీన్మార్ మల్లన్నకు తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. రెండు నెలలకు పైగా జైల్లో ఉన్నా ఆయన బయటికి వచ్చారు. అయితే ఒక కేసులో బెయిల్ పై బయటకు రాగానే మరో కేసులో తీన్మార్ మల్లన్నను ఇరికించి మళ్ళీ జైలుకు పంపించారన్న చర్చ ప్రధానంగా జరిగింది. ఇక మల్లన్నకు బెయిల్ రావడంతో తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు అనేది కీలకంగా మారనుంది. ( కాంగ్రెస్ లోనే ఉంటా.. నా తడాఖా చూపిస్తా ..! )

ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మల్లన్నపై కేసు నమోదు చేయించిందని ఆయన టీం తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ పై తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో జ్యోతిష్యుడు లక్ష్మీకాంత శర్మ తనను తీన్మార్ మల్లన్న 30 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని.. బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తీన్మార్ మల్లన్నపై మొదటి కేసు నమోదైంది.

ఒక కేసు నుండి బయటకు రాగానే తీన్మార్ మల్లన్న పై మరో కేసు నమోదు అవుతూ వచ్చింది. మొత్తం మీద తీన్మార్ మల్లన్న రెండు నెలలకు పైగా జైలు జీవితం గడిపాడు. ఇక తీన్మార్ మల్లన్నపై అక్రమ కేసులు బనాయించారని తీన్మార్ మల్లన్న భార్య అమిత్ షాకు కూడా ఫిర్యాదు చేసింది. తీన్మార్ మల్లన్నపై అక్రమ కేసులు బనాయించారని.. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు పెట్టి కావాలని ఆయనను బయటకు రాకుండా చేస్తున్నారని అమిత్ షాకు తీన్మార్ మల్లన్న పై పెట్టిన కేసులతో కూడిన నివేదికలు పంపించింది తీన్మార్ మల్లన్న భార్య. ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నందుకు తన భర్తను వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమె అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. ( తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్..! )

ఒక పక్క జాతీయ బీసీ కమిషన్ కూడా తీన్మార్ మల్లన్నపై నమోదు చేసిన కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం మీద తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు కావడంతో సోమవారం సాయంత్రం మల్లన్న జైలు నుండి బయటకు వచ్చారు. అయితే తీన్మార్ మల్లన్నను పదే పదే టార్గెట్ చేసి, వివిధ కేసులలో ఇరికించి ఇబ్బంది పెడుతున్న క్రమంలో.. మల్లన్న అనుచరులు ఆరోపణలు చేస్తున్న తరుణంలో ప్రభుత్వం ఆయన విషయంలో లైట్ తీసుకుంటుందా అనేది కూడా కీలకమే. ఇదిలా ఉంటే బయటకు వచ్చిన తర్వాత మల్లన్న మళ్ళీ ముందులాగా తెరాస ప్రభుత్వం పై తన పోరాటం కొనసాగిస్తాడా లేక కొంత కాలం సైలెంట్ గా ఉంటాడో చూడాలి మరి.

Categories TS

Leave a Comment