ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. స్వపక్షంలోనే విపక్షంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది నేతలు. ఇప్పుడు వైసీపీలోని కొన్ని లుకలుకలు బయటకు వస్తున్నాయి.
ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కు ఇంటిపోరు పెరిగిందా..వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న ఆయన వైసీపీలో ఒంటరయ్యారా.. మంత్రి జైరాం కు మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు మద్దతు తెలుపక పోవడానికి కారణాలు ఏంటి.. సొంత పార్టీ నేతలే ప్రతిపక్ష నాయకులకు లీకులిస్తున్నారా.. మంత్రి పై వస్తున్న అవినీతి ఆరోపణలపై సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారా.. మంత్రి జైరాం రాజకీయ భవిష్యత్ పై ప్రభావం చూపనున్నాయా..
ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వరుస వివాదాలు వెంటాడుతున్నాయి మంత్రి సొంత ఊరు గుమ్మనూరులోని పేకాట క్లబ్ పై పోలీసులు దాడులు చేయడం, మంత్రి బంధువు అరెస్ట్ కావడం, భూకబ్జా ఆరోపణలు జై రాముని ఇరుకున పెట్టాయి.
తాజాగా ESI స్కాం లో 14వ నిందితుడిగా ఉన్న కార్తీక్ నుంచి, మంత్రి కుమారుడు ఈశ్వర్ బెంజ్ కార్ గిఫ్ట్ గా తీసుకున్నారని టిడిపి నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించడంతో రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి కుమారుడు షోరూంలో కారు తాళాలు తీసుకోవడం, ఆ కారులో ప్రయాణించడం, ఈ ఫోటోలను టీడీపీ విడుదల చేసింది.
ఇది గిట్టని వారి పనేనా
కర్నూలు జిల్లా లోని కొందరు ఎమ్మెల్యేలకు, మంత్రులు జైరాం కు మధ్య ఉన్న విభేదాల వల్ల ఆయన పక్కా ప్లాన్ తో ఇరికించినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గుమ్మనూరు లో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న విషయాన్ని మంత్రి గిట్టని ప్రజాప్రతినిధులే పోలీసులకు సమాచారం ఇచ్చారు అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే దాంతో పాటు ESI స్కాం నిందితుడితో మంత్రి జైరాం కుమారుడు సన్నిహితంగా ఉన్న విషయాన్ని సైతం, వైరి వర్గం టీడీపీ లీడర్లకు
లీక్ చేసిందట.
తాజాగా మంత్రి జైరాం పై టిడిపి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. మంత్రి జైరాం ESI స్కాం నిందితుడి నుంచి బెంజ్ కారుని బహుమతిగా పొందారని తన ఫిర్యాదులో వెల్లడించారు. అయితే తాను అక్రమాలకు పాల్పడలేదని, తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి గుమ్మనూరు జయరాం చెబుతున్నారు.
ఆరోపణల్లో వాస్తవమెంత
టిడిపి నాయకులు వరుసబెట్టి ఆరోపణలు చేస్తున్నా , మంత్రి కి మద్దతుగా మాట మాత్రమైనా మాట్లాడే సొంత పార్టీ నాయకులు కరువైపోయారు. సహచర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎవరూ మాట్లాడటం లేదు. అటు జైరాం కు మద్దతుగా కర్నూలు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు. దాంతో మంత్రి జైరాం పార్టీలో, ప్రభుత్వంలో ఒంటరయ్యారు అనే చర్చ సాగుతోంది.
మంత్రి జైరాం కు మద్దతుగా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడడం లేదు అన్నది కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పై వచ్చిన ఆరోపణలలో నిజం ఉందని నమ్ముతున్నారా.. లేక ఈ ఆరోపణలు జైరాం వ్యక్తిగత విషయంగా భావిస్తున్నారా అన్న దానిపై చర్చ జరుగుతోంది.
గుమ్మనూరు లో పేకాట క్లబ్ ఘటన వెలుగు చూసిన తర్వాత మంత్రి జైరాం సీఎం జగన్ రహస్యంగా కలిశారట. ఈ విషయంపై మంత్రికి సీఎం గట్టిగానే క్లాస్ పీకారట. ఇప్పుడు బెంజ్ కార్ వివాదముపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో అని ఆందోళనతో ఉన్నారు. అవినీతి అక్రమాల ఆరోపణలు జయరాములు చుట్టుముట్టడంతో ఆయన మంత్రి పదవి ఉంటుందా లేక ఉడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న జైరాం పై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది. తప్పు చేస్తే సొంత మంత్రివర్గ మైన ఒప్పుకునేది లేదు అని చెప్తున్న సీఎం జగన్, మరి ఇలాంటి వారిని ఉపేక్షిస్తారా లేక ఎలాంటి శిక్ష వేస్తారో చూడాల్సిందే.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …