నారా లోకేష్ వ్యవహార శైలే టీడీపీ ఈ పరిస్థితికి కారణమా.?

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న టిడిపికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గొయ్యి తవ్వుతున్నారు. అతని వ్యవహార శైలి వల్లనే టీడీపీపై చులకన భావం ఏర్పడింది. రాజకీయాలు అన్నాక ప్రజల్ని మెప్పించాలి.. ఒప్పించాలి. కానీ లోకేష్ తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ప్రజల్ని.. అలాగే పలువురు వైసిపి నేతలను తిడితేనే ప్రజల్లో క్రేజ్ పెరుగుతుందన్న భ్రమలో ఉన్నట్టున్నాడు నారా లోకేష్. నిత్యం వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడు, నోటి దూల తీర్చుకుంటున్నాడు.

ఇంతకూ లోకేష్ టార్గెట్ ఎవరు..? జగనా లేక చంద్రబాబునా..

ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని ప్రజలే నారా లోకేష్ కు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. అయినా లోకేష్ తీరు మాత్రం మారడం లేదు. టిడిపికి అనుకూలుడు అని ముద్ర పడిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. అప్పుడు విశాఖ నుంచి చిత్తూరు వరకు లోకేష్ తన తిట్ల దండకాన్నే ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టిడిపి ఓడిపోయింది. ఒక్కటంటే ఒక్క కార్పొరేషన్ స్థానాన్ని కూడా గెలుచుకునే లేకపోయింది.

రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల పైచిలుకు పంచాయితీలు ఉంటే.. పట్టుమని రెండువేల చోట్ల కూడా గెలవలేక పోయింది. తాజాగా ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ఫలితాల్లో కూడా టీడీపీ ఘోర పరాజయం చవి చూసింది. ఈ ఫలితాల్లో టీడీపీకి 4 శాతం సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే కారణం ప్రజల్లో టిడిపి మీదవున్న వ్యతిరేకతే. అందునా నారా లోకేష్ మాటలు చూసి ప్రజలు ఏవగించుకుని ఉన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన లోకేష్ వ్యాఖ్యలను చీదరించుకుని మరీ టిడిపిని ఓడించారు.

లోకేష కనుక తన ధోరణిని ఇలాగే కంటిన్యూ చేస్తే.. ఆ పార్టీకి వుండే కాస్త ఓటు బ్యాంకు కూడా దూరమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయినా లోకేష్ మాత్రం కేర్ చేయకుండా.. భవిష్యత్తు మీద ఏమాత్రం బెంగ లేకుండా టిడిపికి గొయ్యి తవ్వుతుండటం గమనార్హం.

1 thought on “నారా లోకేష్ వ్యవహార శైలే టీడీపీ ఈ పరిస్థితికి కారణమా.?”

Leave a Comment