కలత చెందిన అచ్చెన్నాయుడు : టిడిపిలో కోడెల శివప్రసాదరావు కుటుంబం రాజకీయంగా ఎదురీదుతోంది. తెలుగుదేశం పార్టీ కోడెల కుటుంబాన్ని మెల్లగా దూరం పెడుతోంది. ఇందుకు ఉదాహరణ తాజాగా జరిగిన సంఘటనే. బుధవారం సత్తెనపల్లిలో దివంగత కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. వాస్తవానికి కోడెల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు రావాల్సి ఉంది. ( పంచ్ డైలాగులతో పనులు కావు లోకేష్ బాబు )
అచ్చెన్నాయుడు రావాలని స్వయంగా కోరిన శివరాం
కోడెల కుమారుడు శివరాం స్వయంగా అచ్చెన్నాయుడు వద్దకు వెళ్లి ఈ కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానించారు. అయితే అచ్చెన్నాయుడు మాత్రం చివరి నిమిషంలో విగ్రహావిష్కరణకు రాకుండా హ్యాండ్ ఇచ్చారు. తాను వ్యక్తిగత కారణాల రీత్యా ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నాను అని చెప్పినట్లు తెలుస్తోంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదిక
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు
అయితే ఇది అంతగా నమ్మశక్యంగా లేదు.. కానీ కావాలనే కోడెల కుటుంబాన్ని దూరం పెట్టాలన్న అభిప్రాయంతోనే టిడిపి ఈ కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నట్టు అర్థమవుతోంది. అందులో భాగంగానే బుధవారం కొందరు టీడీపీ నేతల చేత కోడెలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి, తద్వారా కోడెల కుటుంబం పై ప్రజల్లో వ్యతిరేకత మరింత రాజేసి, కోడెల కుటుంబాన్ని వదిలించుకోవడానికి టిడిపి పథకం రచించినట్లు తెలుస్తోంది. ( మాజీ ఎంపీ మురళీమోహన్ టీడీపీని వీడటానికి ఆమెనే కారణమా.. ? )
ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు పర్యటనకు వస్తున్నారని ముందుగా సమాచారం ఇచ్చి.. మళ్లీ రద్దు చేయడమంటే కోడెల కుటుంబాన్ని దూరంగా ఉంచుతున్నామని పరోక్షంగా కార్యకర్తలకు సంకేతాలు ఇవ్వడంమే అంటున్నారు. ఈ పరిణామాలతో షాకైన శివరాం మరియు ఇతర కుటుంబ సభ్యులు కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించారు. మరోవైపు టిడిపి అధిష్ఠానం గేమ్ తో కలత చెందిన అచ్చెన్నాయుడు.. ఇదేం చోద్యమని సీనియర్ల వద్ద వాపోయారట. మరి చంద్రబాబు గారి గేమ్స్ మాములుగా వుండవుగా..
1 thought on “చంద్రబాబు ఆడిన గేమ్ లో బొక్కబోర్లా పడ్డ అచ్చెన్నాయుడు.. !”