Fibernet : ఫైబర్ నెట్ స్కాం నిరూపించలేరని కాన్ఫిడెంట్ గా ఉన్న టీడీపీ

Fibernet : ఫైబర్ నెట్ స్కాం లో అవినీతి జరగలేదు అనడంలేదు.. నిరూపించలేరని మాత్రమే అంటున్నారు టీడీపి నాయకులు. ఇప్పటివరకు వైయస్ జగన్ ప్రభుత్వం తమపై అనేక రకాల అవినీతి బురద జల్లిందని, అయితే వాటిని నిరూపించలేక పోయిందని టీడీపీ నేత పట్టాభి అంటున్నారు. ఇప్పుడు ఫైబర్ నెట్ ( Fibernet ) స్కాం లో 121 కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందని జగన్ ప్రభుత్వం అంటోందని.. అయితే అందులో 121 పైసల అవినీతిని కూడా నిరూపించలేరు అని పట్టాభి ముందుగానే తేల్చి చెబుతున్నారు.

పట్టాభి మాటల్లో అవినీతి జరగలేదు అని చెప్పటం మాటెలా ఉన్నా.. నిరూపించలేరన్న కాంఫిడెన్స్ మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తమ హయాంలో అవినీతి జరగలేదు అని పడికట్టు పదాన్ని కూడా ఉపయోగిస్తున్నట్టుగా లేరు టిడిపి నేతలు. నిరూపించలేరని మాత్రం కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు.

ఇప్పటికే జగన్ ప్రభుత్వం తెలుగుదేశం హయాంలోని వివిధ అవినీతి అంశాలను కదిపినా.. ఎక్కడికక్కడ కోర్టులో స్టే తెచ్చుకుని, బెయిల్ తెచ్చుకుని తాము సుద్దపూసలమని టిడిపి నేతలు అంటున్నారు. ఈఎస్ఐ స్కామ్ లో నాటి మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆయన గంటల వ్యవధిలోనే ఆసుపత్రికి వెళ్లిపోయారు. నెలల పాటు ఆసుపత్రిలోనే గడిపి, బెయిల్ వచ్చిన మరుసటి రోజున ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ( మాజీ ఎంపీ మురళీమోహన్ టీడీపీని వీడటానికి ఆమెనే కారణమా.. ? )

ఇక రాజధాని అంశంలో కూడా టిడిపి ముందే కోర్టులను ఆశ్రయించింది. విచారణ జరగడానికే వీల్లేదన్న వాదనలు వినిపించింది. ఇప్పుడు ఫైబర్ నెట్ ( Fibernet ) స్కాం లో కూడా నిరూపించలేరు అంటూ టిడిపి నేతలు సవాళ్లు విసురుతున్నారు. సిఐడి అధికారులు ఇప్పటి వరకు ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. మరి వారి అరెస్టుల వరకు అయినా వ్యవహారం వస్తుందా లేక ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారా.. తదుపరి చర్యలను ఆపమని టిడిపి వాళ్ళు కోర్టులకు ఎక్కుతారో, లేదో చూడాలి.

స్టేలు, తదుపరి చర్యలను ఆపాలనే పిటిషన్లను ఆయుధాలుగా మలుచుకుంటే, ఈ ఫైబర్ నెట్ ( Fibernet ) స్కాం లో మాత్రం ఎవరి పాత్ర బయటపడుతుంది..? బహుశా ఈ కాంఫిడెన్స్ తోనే నిరూపించలేరు అంటూ టిడిపి నేతలు సవాల్ విసురుతున్నారేమో..

1 thought on “Fibernet : ఫైబర్ నెట్ స్కాం నిరూపించలేరని కాన్ఫిడెంట్ గా ఉన్న టీడీపీ”

Leave a Comment