ఆ కులమే .. టిడిపిని కాపాడుతుందా.. !!

TDP 1

ప్రభత్వ వైఫల్యాలని ఎండగట్టడమే ప్రతిపక్షాల పని. కొన్ని సందర్భాలలో ప్రభుత్వం ఏం చేసిన తప్పుపట్టే పరిస్థితి ఉంటుంది.

మరికొన్ని సందర్భాలలో ప్రజా సమస్యలకన్నా పొలిటికల్ మైలేజీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది ఎక్కడైనా జరిగేదే.

మొన్నామధ్య విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిద్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో 10మంది ప్రాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది.

ఈ విషయంలో టిడిపి మొదటినుండి కొంచెం సైలెంట్ గానే వుంది. విశాఖ పాలిమర్స్ ఘటనలో హడావిడి చేసిన ప్రధాన ప్రతిపక్షం టిడిపి, స్వర్ణ ప్యాలెస్ ఘటనలో మాత్రం నోరు మెదపటం లేదు. ( స్వర్ణ ప్యాలెస్ ఘటన..విచారణ కమిటీ నివేదిక.. )

ఈ ప్రమాదం జరిగినప్పుడు ఒకరిద్దరు స్థానిక నేతలు విచారం వ్యక్తం చేసారు. మరికొందరు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తరువాత ఏ ఒక్కరు ఈ ఘటనపై పెద్దగా స్పందించలేదు.

స్వర్ణ ప్యాలెస్ ఘటనలో ఏకంగా 10మంది ప్రాణాలు కోల్పోతే నోరుమెదపని టిడిపి, రమేష్ ఆసుపత్రి యాజమాన్యాన్ని వెనకేసుకొన్స్తుంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హాస్పిటల్ యాజమాన్యానికి టిడిపిలో కొందరు స్నేహితులు ఉండటమే కాకుండా ఒకే సామజిక వర్గం కావడం దీనికి కారణంగా చెప్పుకుంటారు. తాజాగా ఈ వివాదంలో హీరో రామ్ ఎంటర్ అయ్యాడు. ఆ ఘటనపై కులప్రస్తావన తేవడంతో హీరో రామ్ కు టిడిపి అండగా నిలిచింది.

స్వర్ణ ప్యాలెస్ ఘటన జరిగిన వెంటనే ఏపీ ప్రభుత్వం స్పందించింది. భాదిత కుటుంబాలకు 50లక్షల పరిహారం ప్రకటించింది. భాద్యులపై కేసులు నమోదు చేసింది. కమిటీ నివేదిక కూడా తెప్పించింది. దీనితో ప్రతిపక్షానికి డిమాండ్ చేయడానికి ఏ అంశమూ లేకుండా పోయింది. అయితే ఈ ఘటనలో సామజిక వర్గం తెరపైకి రావడం పెద్ద దుమారం లేపుతుంది. ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు అంటూ టిడిపి వాదిస్తోంది. ఈ ఘటనలో హాస్పిటల్ యాజమాన్యం తప్పులేదని , ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని టిడిపి ఆరోపిస్తోంది.

Leave a Comment