ఏపీలో జగన్ ప్రభుత్వ పరిపాలనతో అటు ప్రజలు, వైసిపి నాయకులు మరియు కార్యకర్తలు సైతం హ్యాపీగానే ఉన్నారు. కానీ ప్రతిపక్ష టీడీపీ పార్టీ మాత్రం అధికారాన్ని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగన్ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టడానికి వీరు చేయని ప్రయత్నాలు లేవు. దీంతో ప్రజలు కూడా వీరి పై విముఖత వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇక టిడిపి అధికారంలోకి వస్తుందా అన్న అనుమానాలు అటు తెలుగు తమ్ముళ్లను మరియు పార్టీ నాయకుల్లో కలుగుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే టిడిపి పరిస్థితి రాబోవు రోజుల్లో తెలంగాణలో మాదిరిగా తయారయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ( పోటీ పడనున్న చంద్రబాబు.. ! )
అయితే అటువంటి పరిస్థితులు కలగకుండా ఉండాలంటే.. టిడిపి మళ్లీ పుంజుకోవాలంటే ప్రజలకు దగ్గరయ్యేలా ప్రణాళికలు రచిస్తూ వారి కోసం పోరాడాలి. మరి అటువంటి వాటికి చంద్రబాబు అండ్ పార్టీ రెడీగా వుందా అంటే ఆలోచించాల్సిన విషయమే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే ఎలాగైనా పార్టీని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్ళి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని పలుమార్లు చంద్రబాబు మరియు నారా లోకేష్ ఎప్పుడూ చెబుతూనే వున్నారు. అది అందరికీ తెలిసిందే. కానీ అది అంత సులువుగా జరిగే పని కాదని వారికి కూడా తెలుసు. అందుకే కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదిక
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు
- కుప్పం మున్సిపాలిటీలో Ex-Officio సభ్యునిగా దరఖాస్తు.. బాబు పరిస్థితి ఇలా అయ్యిందేంటి..?
- పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నప్పుడు ఏమైపోయారు బాబు గారు ..?
- ఇరు పార్టీలు సంయమనం పాటించండి.. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ
అదేంటంటే రాబోయే 2024 ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి గట్టి రాజకీయ ప్రణాళికను చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలలో నెగ్గుకు రావాలంటే శత్రువులతో అయినా సరే కలిసి వెళ్లక తప్పదు. అది చంద్రబాబుకు మొదటి నుండీ తెలిసిన రాజకీయమే. ఇప్పుడు అదే విధానాన్ని అవలంబించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎలాగైతే తెరాసను దెబ్బతీయడానికి చంద్రబాబు కాంగ్రెస్తో కలిసి ఎన్నికలకు వెళ్లారో.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ ను ఓడించడానికి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నట్లు జాతీయస్థాయిలో వస్తున్న సమాచారం.
ఏపీలో సాధ్యమేనా
2014 లో బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు 2019 ఎలెక్షన్స్ నాటికి వారితో బంధం తెంచేసుకుని కాంగ్రెస్తో జతకట్టింది. మళ్ళీ 2019 ఎలెక్షన్స్ తరువాత ఒంటరిగానే మిగిలిపోయింది. అయితే మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో జటగట్టడం మేలు అన్న నిర్ణయానికి చంద్రబాబు వచినట్టు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న మమతా బెనర్జీ సాయంతో ప్రశాంత్ కిషోర్ మద్దతు కోసం కూడా ప్రయత్నిస్తున్నారట. అది జరిగే పనేనా.. ఎందుకంటే జగన్ కు, ప్రశాంత్ కిషోర్ కు మధ్య మంచి సంబంధాలే వున్నాయి. అయితే కేంద్రంలో పరిస్థితులు ఎలావున్నా ఇప్పటికే తెలంగాణలో వీరి ప్లాన్ సక్సెస్ కాలేదు. అయినా సరే మళ్లీ ఏపీలో కాంగ్రెస్ తో కలవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ పార్టీలో చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరి వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
2 thoughts on “జగన్ ను దెబ్బకొట్టడానికి చంద్రబాబు మరో స్కెచ్”