Panjshir | పంజ్ షీర్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు !

ప్రపంచాన్ని వణికిస్తున్న తాలిబన్లను సైతం భయపడేలా చేశారు పంజ్ షీర్ ( Panjshir ) ప్రజలు. పంజ్ షీర్ ( Panjshir ) లోని ప్రతిఘటన దళం ప్రజలు చేస్తున్న పోరాట ఫలితంగా తాలిబన్లకు ఇన్ని రోజులు ముచ్చెమటలు పట్టాయి. దాంతో పంజ్ షీర్ ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని యత్నిస్తోన్న తాలిబన్లు .. ఎట్టకేలకు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్లోని పంజ్ షీర్ ( Panjshir ) ప్రావిన్స్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు.

ఇన్నిరోజులు పంజ్ షీర్ లోకి తాలిబన్లు ప్రవేశించలేక పోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ప్రాంతాన్ని కూడా ఆ స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంతే కాకుండా అహ్మద్ మసూద్ మేనల్లుడు అబ్దుల్ తో పాటు పలువురు ముఖ్య నేతలు మృతిచెందారని ప్రకటించారు. తాలిబన్ల దాడి నేపథ్యంలో ప్రతిఘటన బృందం నాయకుడు ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలెహ్ ( Amrullah Saleh ) వేరే సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం. అమ్రుల్లా సాలెహ్ వేరే ప్రాంతానికి వెళ్లి పోవడంతో ఆయన బతికిపోయారు అనే టాక్ వినిపిస్తోంది. ( తాలిబన్ల అధీనంలోకి ఆఫ్ఘనిస్థాన్ )

ఇక ఆయన ఇంటిపై కూడా తాలిబన్లు దాడికి పాల్పడ్డారు. నీరు, ఆహారం, వైద్య సదుపాయాలు అత్యవసరంగా అందించి ఆదుకోవాలని ఆయన ఐరాసతో పాటు అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. కానీ ఇప్పుడు తాలిబన్ల చేతిలోకి పంజ్ షీర్ ( Panjshir ) ప్రాంతం వెళ్లిపోయిందని వార్త విస్మయ పరుస్తోంది. తాలిబాన్లు తాము అనుకున్నది సాధించడంతో తరువాత ఏంటి అనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది.

1 thought on “Panjshir | పంజ్ షీర్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు !”

Leave a Comment