- హైద్రాబాద్ నుంచి ఢిల్లీకి కార్గో సర్వీస్
- గూడెం నుంచి బంగ్లాదేశ్‌కు ఎండుమిర్చి అల్లం
- జిల్లా నుంచి రూ.3 కోట్ల విలువైన సరుకుల రవాణా
Operation Akarsh | రైల్వే ఆదాయంపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపడంతో, ఆ లోటును భర్తీ చేసుకొనేందుకు గూడ్సు రవాణాను పెంచుకోడానికి రైల్వే ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది.గూడ్సు రవాణాలో తొలిసారిగా పూర్తిస్థాయి రవాణా మార్కెట్‌ను చేజిక్కించుకొనే క్రమంలో ఆఫర్లతో, గూడ్సు రవాణా ఆకర్ష్ పథకాన్ని అమలు చేస్తోంది.
మన దేశంలోనే కాకుండా, ఈ శాన్య రాష్ట్రాల రవాణా, ఇతర దేశాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించింది. సరుకుల రవాణాతో పాటు కార్గో సేవలను అందుబాటులోకి తెచ్చింది.
and సనత్‌నగర్ నుంచి ఢిల్లీకి ప్రతీ బుధవారం ప్రత్యేక కార్గో సర్వీస్‌ను నడుపుతోంది. జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెం పట్టణంతో పాటు, ఏలూరు, నర్సాపురం, వంటి రైల్వే స్టేషన్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది.నెలకు జిల్లాలోని స్టేషన్‌ల ద్వారా సరుకుల రవాణా నుంచి మూడుకోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది.
గూడ్సు రవాణాపై ప్రత్యేక దృష్టి
కోవిడ్ నేపధ్య ప్రభావం సరుకుల రవాణాపై పడి , ఆదాయం బాగా మందగించింది. So ఈ ఆదాయం పెంచుకొనే క్రమంలో సికింద్రాబాద్‌లోని చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇటీవల వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. హైద్రాబాద్, సికింద్రాబాద్, గుంటూరు. విజయవాడ డివిజన్ల పరిధిలోని ఉద్యోగులతో సరుకుల రవాణాపై మాట్లాడారు.
డివిజినల్ కమర్షియల్ మేనేజర్ , అసిస్టెంటు కమర్షియల్ మేనేజర్లు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి సరుకుల రవాణాలో ఆదాయం పెంపుదల కోసం ఇస్తున్న రాయితీలు, కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. దీంతో గూడ్సు సూపర్ వైజçర్లు వ్యాపార, వాణిజ్య. పారిశ్రామిక వర్గాల ప్రతినిధులను కలిసి ఈ విషయాలను వెల్లడించారు.
ఎల్‌ఆర్ త్రీలో రాయితీలు
గూడ్సు రవాణాలో ఎల్‌ఆర్‌త్రీ నుంచి 200 వరకు సరుకులను బట్టి క్లాసులు ఉంటాయి. ఎల్‌ఆర్‌త్రీ కిందకు వచ్చే సరుకుల రవాణాలో రాయితీలు అధికంగా ఇస్తున్నారు. ఉల్లి పాయలు, ఫుడ్ గ్రెయిన్స్ వంటివి దీని కిందకు వస్తాయి. బియ్యం 130ఏ క్లాసు కిందకు వస్తుంది. సరుకును బట్టి రాయితీలు ఉంటాయి.
గతంలో సరుకుల రవాణాలో 50 కిలో మీటర్ల వరకే రాయితీలు ఉండేవి. ప్రస్తుతం 51 నుంచి 75 కిలో మీటర్ల వరకు 25 శాతం, 76 నుంచి 90 కిలో మీటర్ల వరకు పది శాతం రాయితీని సరుకుల రవాణాలో ఇస్తున్నారు. సరుకుల రవాణా రానుపోను బుక్ చేసుకుంటే రౌండ్ ట్రిప్ రాయితీగా 30 శాతం ఇస్తున్నారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్‌కు సీఎస్ కమిటీ నివేదిక
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు
జిల్లాలో మూడు కోట్ల ఆదాయం
జిల్లాలోని రైల్వే స్టేషన్‌ల ద్వారా సరుకుల రవాణా ద్వారా సుమారు మూడు కోట్ల రూపాయల ఆదాయం నెలకు వస్తుంది. ఎఫ్‌సీఐ. సీడబ్ల్యూసీ గోదాముల ద్వారా బియ్యం రవాణా, ఇతర ప్రాంతాల నుంచి ఎరువులు మాత్రం దిగుమతి అయ్యేవి. తాడేపల్లిగూడెం, ఏలూరు, నిడదవోలు, నవాబుపాలెం, భీమవరం, నర్సాపురం, తణుకు వంటి స్టేషన్‌లకు సరుకుల రవాణా ద్వారా నెలకు మూడు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది.
గూడెం నుంచి బంగ్లాదేశ్‌కు మిర్చి
తాడేపల్లిగూడెం నుంచి ప్రత్యేక రాయితీ స్కీమ్‌లో మే 12న బంగ్లాదేశ్‌కు ఎండుమిర్చిని గూడ్సులో పంపించారు. ఎల్‌ఆర్‌త్రీ స్కీమ్‌లో అల్లం నాలుగు భోగీలు పంపించారు. ఆంధ్రాఘగర్స్ వ్యాగన్లలో పంచదారను కోల్‌కతలోని డొంకిని ప్రాంతానికి పంపించారు.