నల్లధనానికి వ్యతిరేకంగా భారత్ మరో కీలక మైలురాయి దాటింది. విదేశాలలో మూలుగుతున్న కోట్ల రూపాయల నల్లధనాన్ని భారత్ కు రప్పించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు ఫలితాలు కనిపిస్తున్నాయి. స్విజ్జర్లాండ్ తో కుదిరిన ఒప్పందంలో భాగంగా పౌరుల ఖాతా వివరాలను భారత్ పొందింది. ఇలా సమాచారాన్ని పొందడం రెండవసారి. దీంతో ఇప్పుడు నల్ల కుబేరుల గుండెల్లో వణుకు మొదలయింది.
ఈ ఏడాది ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ( AEOI ) కు సంబంధించి గ్లోబల్ స్టాండర్డ్స్ నిబంధనల మేరకు ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ ( FTA ) ఖాతాలకు సంబంధించిన వివరాలను అందజేయనుంది. ఈ జాబితాలో 86 దేశాలు ఉండగా అందులో భారత్ కూడా ఒకటి ఉంది. 2019లో 75 దేశాలకు స్విజర్లాండ్ తొలి విడతలో భాగంగా వివరాలు అందించింది.
అప్పుడు భారత్ స్విస్ బ్యాంక్ నుండి ఖాతాదారుల మొదటి జాబితా రాబట్టింది. ఈ ఏడాది జరిగిన సమాచార మార్పిడిలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలకు సంబంధించిన 31 లక్షల ఖాతాలకు సంబంధించిన వివరాలు అందించినట్లుగా FTA పేర్కొంది. వెల్లడించిన వివరాలలో భారత్ కు సంబంధించిన ఖాతాలే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
గత ఏడాది సుమారుగా 100 మంది అనుమానాస్పద ఖాతా వివరాలను భారత్ కు అందించగా, ఈ ఏడాది వాటి సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ ఖాతాలలో పన్ను ఎగవేత, అక్రమ లావాదేవీలు వంటి చర్యలు ఉంటే వాటిపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 2018 కంటే ముందు క్లోజ్ చేసుకున్న ఖాతాలే ఎక్కువ అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
స్విస్ అధికారులు పంచుకున్న ఖాతాలో పనామా, వర్జిన్ దీవులు వంటి దేశాల్లో భారతీయులు నెలకొల్పిన కంపెనీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు ,రాజ కుటుంబాలకు చెందిన వ్యక్తుల వివరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా భారత ప్రభుత్వంతో స్విస్ అధికారులు పంచుకునే సమాచారములో బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఖాతా దారుని పేరు, చిరునామా, నివసించే దేశం, పన్ను గుర్తింపు నెంబర్, బ్యాంకుల పేర్లు, అకౌంట్లో బ్యాలెన్స్, క్యాపిటల్ ఇన్కమ్ వంటి కీలక సమాచారం ఉంటుంది.
పన్ను చెల్లింపుదారులు తమ టాక్స్ రిటర్న్స్ లో సరైన సమాచారం అందించారా, లేదా అనే కోణంలో పన్ను అధికారులు ఈ సమాచారాన్ని పరిశీలించేందుకు అనుమతిస్తారు. రెండో జాబితాలో వెల్లడించిన భారతీయ ఖాతాలో ఎంత మొత్తం సంపద ఉందన్న వివరాలు మాత్రం అధికారులు వెల్లడించారు.
ఒప్పంద నిబంధనల్లో పొందుపరచిన గోప్యతా క్లాసుల కారణంగానే ఈ సమాచారాన్ని వెల్లడించలేదని అధికారులు చెబుతున్నారు. ఇక వచ్చే ఏడాది సెప్టెంబర్లో బ్యాంకు అధికారులు తమ బ్యాంకుల్లో భారత జాతీలు, వారి సారథ్యంలోని వ్యవస్థల ఖాతాలకు సంబంధించిన సమాచారంతో కూడిన మూడవ జాబితాను భారత్ కు అందజేయనున్నట్లు తెలుస్తోంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …